కోలారు: పిల్లల విద్యా ప్రగతికి తల్లిదండ్రుల సహకారం ఎంతో ముఖ్యమని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పరశురాం అన్నారు. నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ప్రథమ పోషకుల సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లల విద్యాభివృద్ధికి పోషకులు తమ అమూల్యమైన సలహాలు అందించాలన్నారు. నిత్యం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సీఈటీ, నీట్, కౌశల్య పరీక్షలపై విశేష తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ పిల్లల కోసం పోషకులు ప్రతినిత్యం గంటసేపు కేటాయించాలన్నారు. విద్యార్థులు అతిగా మొబైల్ ఫోన్‌లు వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపన్యాసకులు పార్వతమ్మ , రుక్మిణి, పద్మ, కృష్ణప్ప, ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కరాటే పోటీల్లో
బంగారు పతకం
కోలారు : నగరంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 2వ అంతర్ రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో బంగారుపేటకు చెందిన వి. సుశాంత్ కుమత బంగారు పతకం సాధించాడు. నగరంలోని గల్‌పేట పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటాచలపతి కుమారుడు సుశాంత్.. బంగారుపేటలోని జైన్ గ్లోబల్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. కరాటేలో ఉత్తమ శిక్షణ పొంది అండర్–10 విభాగం పోటీల్లో సత్తా చాటి పతకం సాధించాడు. ప్రతిభ చూపిన సుశాంత్‌ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
విద్యాప్రగతికి తల్లిదండ్రుల సహకారం అవసరం