
వ్యక్తి అదృశ్యం
హొసపేటె: నగరంలోని చిత్తవాడ్గికి చెందిన ఈరన్న అనే 43 ఏళ్ల వ్యక్తి పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిత్తవాడ్గి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈరన్న గురించి ఏదైనా సమాచారం తెలిస్తే చిట్టవాడ్గి పోలీస్ స్టేషన్ పీఐ మొబైల్ నంబర్లకు (9490905733, 9480805757) సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
లోక్ అదాలత్‌పై అవగాహన
కోలారు: లోక్ అదాలత్ సేవలపై జిల్లా కానూను సేవల ప్రాధికార కార్యదర్శి, సివిల్ న్యాయమూర్తి ఆర్.నటేష్ సోమవారం నగరంలోని కేఎస్ ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులకు అవగాహన కల్పించారు. రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకొని సమయం, డబ్బు ఆదా చేసుకోవాలని సూచించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎల్‌ఏడీసీ ఉప ప్రధాన కానూను అరివు అధ్యక్షుడు సతీష్, తదితరులు పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్ సేవలు ప్రశంసనీయం
కోలారు: భారతీయ రెడ్‌క్రాస్ సంస్థ దివ్యాంగులకు సహకారం అందించాలని డిప్యూటీ కలెక్టర్ మంగళ సూచించారు. భారతీయ రెడ్ క్రాస్ సంస్థ అందజేసిన కిచన్ కిట్‌లను సోమవారం ఆమె తన కార్యాలయంలో పేదలకు పంపిణీ చేసి మాట్లాడారు. రెడ్‌క్రాస్ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. సంస్థ జిల్లా సభాపతి గోపాలకృష్ణగౌడ, రాష్ట్ర పాలక మండలి సభ్యుడు శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందీష్, శ్రీనివాసన్ పాల్గొన్నారు.

వ్యక్తి అదృశ్యం