
అన్నీ నకిలీ ప్రొఫైల్సే
● బెంగళూరు సిటీలో 2021లో 105 ఎఫ్‌ఐఆర్లు నమోదయ్యాయి. 2022లో 135 కేసులు, 2023లో 61 కేసులు, 2024లో 60 కేసులు, 2025 మే వరకు 30 కిపైగా కేసులు నమోదయ్యాయి.
● సోషల్ మీడియా, వివిధ వెబ్‌సైట్లలో వివాహ సంబంధాల కోసం మొదటి, రెండవ పెళ్లికి వివరాలు అప్‌లోడ్ చేస్తున్నవారి కోసమే మోసగాళ్లు వేచి చూస్తుంటారు.
● ఒకటే కులం, పెద్ద ధనవంతులం, పెళ్లికి సిద్ధమని చెప్పగానే నిజమని నమ్మేయడం, మోసపోవడం మామూలుగా మారింది.
● కన్నడ మాట్రిమోనియల్ వెబ్‌సైట్లను పరిశీలిస్తే, ఢిల్లీ, రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల వ్యక్తులు తప్పుడు ఆధార్, పాన్ కార్డు, అడ్రస్‌లతో స్థానికులని నమోదు చేసుకుంటున్నారు. వారి నకిలీ ప్రొఫైల్స్‌ని నమ్మి అమాయక వనితలు బలైపోతున్నారు.