
గ్రహణం.. కావాలి శుభదాయకం
బనశంకరి: ఆదివారం రాత్రి చంద్రగ్రహణం సంభవించడంతో రాష్ట్రంలోని వివిధ దేవస్థానాల్లో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంది. గ్రహణం సందర్భంగా కొన్ని ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. బెంగళూరు బసవనగుడిలోని దొడ్డ గణపతి ఆలయంలో పూజలు జరిగాయి. పెద్దఎత్తున భక్తులు పాల్గొని దర్శనాలు చేసుకున్నారు. అన్ని విఘ్నాలు తొలగిపోవాలని లంబోదరునికి వేడుకున్నారు. ప్రతిరోజు రాత్రి 8.30 గంటలకు మూసివేసే ఆలయాలు సాయంత్రమే మూతపడ్డాయి. గ్రహణం రోజున దర్శించుకుంటే మంచి కలుగుతుందని ఉదయం నుంచి భక్తులు గుడులకు క్యూ కట్టారు.
రక్తవర్ణ గ్రహణం
గ్రహణ కారణంతో నగరంలోని గవి గంగాధరేశ్వర ఆలయం, చిక్కబళ్లాపుర నందిగ్రామంలోని భోగనందీశ్వర దేవస్థానం, నందిగిరిపైనుండే యోగనందీశ్వర ఆలయంతో పాటు అనేక మందిరాలను సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి సోమవారం ఉదయం తెరుస్తారు. ఈ దఫా రక్తవర్ణ చంద్ర గ్రహణం వచ్చినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడు పూర్తిగా ఎరుపురంగులోకి తిరుగుతాడు, దీనిని రక్తచంద్ర అని పిలుస్తారని పండితులు తెలిపారు. గ్రహణం వేళలో ప్రజలు వారి వారి సంప్రదాయాల ప్రకారం ఆచారాలను పాటించారు.
సాయంత్రం నుంచి హంపీలో నిర్మానుష్యమైన విరూపాక్ష ఆలయం
చిక్కబళ్లాపురలోని భోగనందీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
ఆలయాలలో విశేష పూజలు
దొడ్డ గణపతి దేవస్థానంలో రద్దీ
సాయంత్రం నుంచి మూసివేత

గ్రహణం.. కావాలి శుభదాయకం

గ్రహణం.. కావాలి శుభదాయకం

గ్రహణం.. కావాలి శుభదాయకం