
ఆ పుర్రె తెచ్చింది విఠల్
బనశంకరి: ధర్మస్థల మీద దుష్ప్రచారం చేయడానికి చూపిన పుర్రె కేసులో సిట్ అధికారుల దర్యాప్తులో అనేక అంశాలు బయటపడ్డాయి. వృద్ధురాలు సౌజన్యభట్ మామ విఠల్‌గౌడకు తలపుర్రె ఐడియా గిరీశ్ మట్టణ్ణవర్ ఇచ్చినట్లు తేలింది. సిట్ విచారణలో విఠల్‌గౌడ తలపుర్రె గురించి చెప్పాడు. అడవిలో ఓ పుర్రె ను గాలించి తీసుకురావాలని గిరీశ్ చెప్పాడన్నాడు. ఏడాది కిందట బంగ్ల గుడ్డె నుంచి విఠల్‌గౌడ పుర్రె గాలించి తీసుకురాగా, కారుడ్రైవరు ప్రదీప్‌గౌడ సాయంచేశాడు. బెంగళూరుకు వచ్చి గిరీశ్, జయంత్‌లకు అందజేశాడు. వారు ఉజిరెలోని ఇంట్లో మహేశ్ తిమరోడికి పుర్రెను అప్పగించారు. అక్కడే గ్యాంగ్ చిన్నయ్య కు పుర్రెను అందించినట్లు విఠల్‌గౌడ నోరువిప్పాడు.
చిన్నయ్యను నమ్మించారు
సౌజన్యకు న్యాయం చేయాలని ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేను కలవగా స్పందించలేదని విఠల్‌గౌడ విచారణలో చెప్పాడు. బంగ్లగుడ్డలో అనేక శవాలు ఉన్నాయి, అక్కడ తవ్వితే బయటపడతాయని తాను, మిగతావారు చిన్నయ్యను నమ్మించినట్లు తెలిపాడు. పుర్రె లభించిన స్థలాన్ని 11ఏ గా గుర్తించారు. విఠల్, ఇతర ముఠా సభ్యులు చెప్పడంతోనే చిన్నయ్య ఎస్పీ, జడ్జి ముందుకు వచ్చి ధర్మస్థలలో అత్యాచారం, హత్యకు గురైన వందలాది శవాలను చుట్టుపక్కల పూడ్చిపెట్టానని తెలిపాడు. ఈ కుట్రకు పాల్పడిన వారి కోసం సిట్ గాలిస్తోంది. శనివారం అర్ధరాత్రి వరకు గిరీశ్ మట్టణ్ణవర్, జయంత్, యూట్యూబర్ అభిషేక్‌లను విచారించి సమాచారం సేకరించారు.
మరో ముగ్గురు నిందితులతో కలిసి కుట్ర
ధర్మస్థల కుట్ర కేసులో విఠల్‌గౌడ అరెస్టు