
ఏకదంతాయ.. వక్రతుండాయ
నీటి టబ్‌లో నింపిన నీరు
హొసపేటె: ఒక వైపు ధర్మస్థల సమస్యకు సంబంధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున అనుకూల, వ్యతిరేక చర్చ జరుగుతోంది. మరో వైపు విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలో 11వ రోజు గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ధర్మస్థల మంజునాథ స్వామి, ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే చిత్రపటంతో భారీ ఊరేగింపు జరిగింది. నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక వడకరాయ ఆలయ సమీపంలో హిందూ మహా గణపతి నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ఈ దృశ్యం కనిపించింది. 11వ రోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా పెద్ద సంఖ్యలో గుమిగూడిన హిందూ భక్తులు డీజే సౌండ్‌కు అనుగుణంగా నృత్య ప్రదర్శన చేశారు. దీంతో పాటు జామియా మసీదు ముందు ఉన్న శ్రీ గణేష్ విగ్రహాన్ని చూడటానికి పది వేల మందికి పైగా ప్రజలు ఊరేగింపులో పాల్గొన్నారు. నగరంలో సుమారు తొమ్మిది గణేష్ విగ్రహాలను నగరంలో రైల్వే రహదారిలో ఉన్న తుంగభద్ర పవర్ కెనాల్‌లో నిమజ్జనం చేశారు. గణేష్ నిమజ్జనం ఊరేగింపులో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్: నగరంలో వైభవంగా 11వ రోజు 48 వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరిగాయి. శనివారం రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన వినాయకుల ఊరేగింపు ఆదివారం 11 గంటల వరకు కొనసాగింది. తీన్ కందిల్ నుంచి సూపర్ మార్కెట్, మహావీర్ చౌక్, మహాబళేశ్వర చౌక్, షరాఫ్ బజారు, పేట్లా బురుజు మీదుగా ఖాస్ బావి వరకు డీజే శబ్దాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ గణనాథులను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పూజలు చేశారు.
ప్రశాంతంగా 11వ రోజు గణేష్ నిమజ్జనం
గట్టి బందోబస్తు నిర్వహించిన పోలీసులు

ఏకదంతాయ.. వక్రతుండాయ

ఏకదంతాయ.. వక్రతుండాయ