
మహా మానవతావాది నారాయణ గురూ
బళ్లారి రూరల్: నారాయణ గురూ మహా మానవతావాది అని మాయకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కె.ఎస్.బసంతప్ప తెలిపారు. ఆదివారం దావణగెరె జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన నారాయణ గురూ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నారాయణ గురూ నాటి సమాజంలో అసమానతలు, మూఢాచారాలకు విరుద్ధంగా గళమెత్తారన్నారు. అస్పృశ్యతను నివారించడానికి దళితులకు ఆలయాల్లో ప్రవేశాలను కల్పించారన్నారు. సమానతలను సాధించడానికి అక్షరాస్యత అవసరమని రాత్రి బడులను ప్రారంభించి సాక్షరత శాతాన్ని పెంచారని తెలిపారు. ఈసందర్భంగా ఏడీసీ శీలవంత శివకుమార్ మాట్లాడుతూ నారాయణ గురూ జయంతిని నిర్వహించడమే కాకుండా ఆయన తత్వాలను సిద్ధాంతాలను ఆచరించాలని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా శ్రీనారాయణగుర చిత్రపటానికి పూలమాలలు వేశారు. కన్నడ సంస్కృతి శాఖ సహాయక సంచాలకుడు రవిచంద్ర, జెడ్పీ సహాయక కార్యదర్శి బసవరాజు, ఈడిగ సమాజ గౌరవాధ్యక్షుడు హెచ్.శంకర్, కార్యదర్శి దేవేంద్రప్ప, ఉపాధ్యక్షుడు శాంతారామ్ పాల్గొన్నారు.
బ్రహ్మశ్రీ నారాయణ గురూజీ జయంతి
రాయచూరు రూరల్: నగరంలో బ్రహ్మశ్రీ నారాయణ గురూజీ జయంతిని సరళంగా ఆచరించారు. ఆదివారం మహిళా సమాజ్, రంగమందిరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖ, రాయచూరు జిల్లా ఆర్య ఈడిగ సంఘం ఆధ్వర్యంలో జరిగిన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణ గురూజీ చిత్రపటానికి రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసన గౌడ దద్దల్, ఎమ్మెల్సీ వసంత కుమార్ పూలమాలలు వేసి మాట్లాడారు. సమాజానికి గురువులు చేసిన సేవలు, అందించిన మార్గదర్శనాల గురించి వివరించారు. సమావేశంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, జిల్లా ఆర్యఈడిగ సంఘం అధ్యక్షుడు వీరనగౌడ, సతీష్, అశోక్, తాయన్న గౌడ, సురేష్, నరసన గౌడ, పంపన గౌడ, శాంతప్ప, నాగన గౌడ, లక్ష్మి రెడ్డి, శ్రీనివాస రెడ్డిలున్నారు.

మహా మానవతావాది నారాయణ గురూ