
రాష్ట్రాభివృద్ధిలో మఠాల పాత్ర కీలకం
ప్రారంభిస్తున్న స్వామీజీలు,
చిత్రంలో మాజీ ఎమ్మెల్యేలు తదితరులు
కార్యక్రమంలో మాట్లాడుతున్న
నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి
సాక్షి,బళ్లారి: రాష్ట్రాభివృద్ధిలో వీరశైవ లింగాయత్ మఠాల పాత్ర అపారమని, బళ్లారి జిల్లాతో పాటు ఉత్తర కర్ణాటకతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వీరశైవ మఠాలు తమదైన శైలిలో పేదలకు సేవ చేస్తూ, బసవణ్ణ తత్వ సిద్ధాతాలను ముందుకు తీసుకెళుతుండటం హర్షణీయమని నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన నగరంలోని బసవ భవన్‌లో బసవ సంస్కృతి అభియాన్ వేదికలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వానికి దీటుగా పాఠశాలలు, కళాశాలలు నడుపుతూ పేదలకు విద్యనందిస్తున్నారని కొనియాడారు. బసవణ్ణ తత్వ సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని మోకా రోడ్డులో రూ.2 కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా బసవణ్ణ విగ్రహం ఏర్పాటు చేస్తామని, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పలువురు స్వామీజీలు మాట్లాడుతూ నగరంలో బసవ సంస్కృతి అభియాన్ ఉత్సవం ఏర్పాటు చేసి బసవణ్ణ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో మఠాధీశులు గదగ్ తోంటధార్య జగద్గురువు సిద్దరామ స్వామి, బసవప్రభు మహాస్వామి, నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, లింగాయత్ సమాజ ప్రముఖులు మహంతేష్, రవిశంకర్, సిరిగేరి పన్నారాజ్, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు వైద్యం, విద్య కల్పనలో
ముందంజ
నగరంలో రూ.2 కోట్లతో బసవణ్ణ విగ్రహం
నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వెల్లడి

రాష్ట్రాభివృద్ధిలో మఠాల పాత్ర కీలకం