
అనంత పద్మనాభ వ్రతం
కోలారు: భాద్రపద మాసం చతుర్థి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని శనివారం పలువురు తమ నివాసాలలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా అన్ని తాలూకాలల్లో వ్రతాన్ని ఆచరించారు. గౌరీ గణపతి పూజల 9 రోజుల తరువాత వచ్చే అనంత పద్మనాభ స్వామి వ్రతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సత్యనారాయణ వ్రతంతో సమానంగా భావించి ఆదిశేషునిపై శయనించిన మహా విష్ణువును పూజిస్తారు. కొన్ని కుటుంబాలు 14 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే, మరికొందరు జీవితాంతం ఏటేటా జరుపుతారు.
ఐకమత్యమే ఓనం ఆశయం
చిక్కబళ్లాపురం: ముద్దేనహళ్లి సత్యసాయి గ్రామంలో జరుగుతున్న ఒక జగత్తు – ఒక కుటుంబం సాంస్కృతిక వేడుకల్లో ఓనం ఉత్సవాలు కనువిందుగా సాగాయి. సద్గురు మధుసూదన్‌సాయి కేరళ ఓనం పండుగ ప్రాశస్త్యాన్ని వివరించారు. ఆధ్యాత్మిక మనోభావంతో నేను, నాది అనేది అహంకారం వదిలివేయాలన్నారు. ఆ భావాలు లేకుండా పండుగను ఐకమత్యంగా ఆచరించడమే ఓనం పండుగ ఆశయమని చెప్పారు. ఈ సందర్భంగా కేరళ కళాకారిణుల మోహినియాట్టం నృత్యం, చండె వాయిద్యాల ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
విషాద... భావన
● కవల కూతుళ్లలో ఒకరు మృతి
యశవంతపుర: ప్రముఖ కన్నడ నటి, నృత్యకారిణి భావన రామన్న ఇటీవల ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చి కవల పిల్లలకు జన్మనివ్వడం తెలిసిందే. అలా ఆమె మాతృత్వ ఆనందాన్ని చవిచూస్తున్న తరుణంలో విషాద సంఘటన జరిగింది. కవల పిల్లల్లో ఒకరు కన్నుమూశారు. 40 ఏళ్ల భావన ఒంటరి మహిళగానే ఉన్నారు. అయితే మాతృత్వానికి అది అడ్డంకి కాదని చాటాలనే లక్ష్యంతో ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చినట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించడంతో పాటు ఫోటోలను కూడా అప్‌లోడ్ చేశారు. దీంతో అభిమానులు, సీ్త్రవాదులు హర్షం వ్యక్తంచేశారు. రెండు వారాల క్రితం ఒకే కాన్పులో కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు అడ పిల్లలు జన్మించగా ఒక శిశువు శనివారంనాడు అస్వస్థతతో మృతి చెందినట్లు తెలిసింది. ఒక శిశువు అరోగ్యవంతురాలిగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 20, 30 ఏళ్లలో తాను తల్లి కావడం గురించి ఆలోచించలేదని, కానీ 40లలో ఆ భావన వెంటాడిందని ఆమె చెప్పేవారు. అందుకే పిల్లల కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆమె విషాదంలో మునిగిపోయారు.

అనంత పద్మనాభ వ్రతం

అనంత పద్మనాభ వ్రతం