
ఈ ఏడాది 3,530 కేసులు..
● బెంగళూరుతో పాటు రాష్ట్రంలో 2024లో 4188 కేసులు నమోదు చేసి 2243 మంది డ్రగ్స్‌పెడ్లర్లను అరెస్ట్ చేసి రూ.165 కోట్ల విలువ చేసే 5,743 కిలోలు గంజాయి, 289 కేజీల సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
● 2025 జూలై వరకు 3,530 కేసులు నమోదు చేసి 980 మంది డ్రగ్స్‌పెడ్లర్లను అరెస్ట్‌చేసి రూ.135 కోట్ల విలువచేసే 2,582 కిలోల గంజాయి, 330 కిలోల సింథటిక్ డ్రగ్స్‌ని సీజ్ చేశారు. వీటిలో కొకైన్, ఎండీఎంఏ క్రిస్టల్, హెరాయిన్, తదితరాలు ఉన్నాయి.
యాప్, సహాయవాణి..
ప్రజల నుంచి ఫిర్యాదులకు డ్రగ్స్ ఫ్రీ కర్ణాటక అనే మొబైల్ యాప్ విడుదల చేసి, 1042 సహాయవాణిని ఏర్పాటు చేశారు. డ్రగ్స్ గురించి తెలిస్తే వీటికి ఫిర్యాదు చేయవచ్చు. మత్తు పదార్థాలకు అడ్డుకట్టే తమ లక్ష్యమని, ప్రజలు డ్రగ్స్ గురించి సమాచారం అందించాలని నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు.