
కంటి చికిత్సల పథకం
● ఆశాకిరణ పథకం అన్ని జిల్లాల్లో అమలు చేయడానికి రూ.52.85 కోట్లు నిధుల మంజూరు. ఈ పథకం ద్వారా ప్రజలకు కంటి పరీక్షలను నిర్వహించి అంధత్వ నివారణ చర్యలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారు.
● బెంగళూరు దక్షిణ జిల్లా కనకపుర తాలూకా రాయసంద్ర గ్రామంలో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు. ఇందుకు కర్ణాటక గృహమండలి నుంచి రూ.65 కోట్లతో 25 ఎకరాల భూమి కొనుగోలు చేయడానికి పాలనాత్మక ఆమోదం.
● రైతులు, కన్నడపరపోరాటదారులపై ఉన్న 60 కేసుల మాఫీకి అనుమతి
● వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ సమితుల శుల్కం మార్పు చేశారు. మార్కెట్ శుల్కం 41 పైసలు నుంచి 42 పైసలకు పెంచారు.