అనుమానాస్పద రీతిలో నక్సలైట్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద రీతిలో నక్సలైట్‌ అరెస్ట్‌

Sep 5 2025 8:09 AM | Updated on Sep 5 2025 8:09 AM

అనుమా

అనుమానాస్పద రీతిలో నక్సలైట్‌ అరెస్ట్‌

రాయచూరు రూరల్‌: బిహార్‌కు చెందిన మనోజ్‌ సాదా(28) అనే ప్రముఖ నక్సలైట్‌ను బుధవారం నగరంలో అనుమానాస్పద రీతిలో గ్రామీణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. యరమరస్‌లోని బియ్యం మిల్లులో పని చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న బిహార్‌లోని ఖగారియా జిల్లా అలౌలి పోలీసులు రాయచూరు గ్రామీణ పోలీసుల సహకారంతో దాడి చేసి మనోజ్‌ సాదాను అరెస్ట్‌ చేశారు.

ఎయిమ్స్‌ ఏర్పాటుకు వినతి

రాయచూరు రూరల్‌: రాయచూరులో ఎయిమ్స్‌ ఏర్పాటు చేయాలని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థాపకులు రవిశంకర్‌ గురూజీని కోరారు. గురువారం బెంగళూరులో రాయచూరు ఎయిమ్స్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించి రాష్ట్రపతి, గవర్నర్‌, ముఖ్యమంత్రిలకు రాసిన లేఖలను చూపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించి రాయచూరుకు ఎయిమ్స్‌ను కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని గురూజీ అన్నారు. పోరాట సమితి అధ్యక్షుడు బసవరాజ్‌ కళస, అశోక్‌ కుమార్‌ జైన్‌, గుండూరావ్‌, గవిసిద్దప్ప, బేరి, శివబసప్ప, జగదీష్‌, ఉదయ కుమార్‌లున్నారు.

నాగమోహన్‌దాస్‌

నివేదిక ఆమోదించొద్దు

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తరుణంలో జిస్టిస్‌ నాగమోహన్‌ దాస్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను తిరస్కరించాలని అఖిల భారత బంజార సేవా సమితి డిమాండ్‌ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నారాయణప్ప మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణపై కాంగ్రెస్‌ సర్కార్‌కు జిస్టిస్‌ నాగమోహన్‌ దాస్‌ అందించిన నివేదిక రూపకల్పనలో ఎస్సీ వర్గాల వారిని నియమించకుండా అగ్ర వర్ణాల వారిని నియమించారన్నారు. కమిషన్‌ అధ్యక్షుడిగా అగ్రవర్ణాల వారినే నియమించడంతో లోపాలు ఏర్పడ్డాయన్నారు. ఆది కర్ణాటక, ద్రావిడ, ఇతర ఉప కులాలను చేర్చడంలో ఉన్న లోపాలను సవరించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

రోగులకు పౌష్టికాహారం ఏదీ?

రాయచూరు రూరల్‌: పేద రోగులకు రిమ్స్‌లో మంచి ఆహార పదార్థాలను అందించకుండా పురుగులు పడిన ఆహారాన్ని అందిస్తున్నారని దళిత సేనా సమితి ఆరోపించింది. గురువారం రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్‌) వైద్య కళాశాల ఆస్పత్రి పరిశోధన కేంద్ర కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు భరత్‌ మాట్లాడారు. రిమ్స్‌లో రోగులకు పంపిణీ చేసే ఆహార పదార్థాల్లో పురుగులతో కూడిన అన్నం పంపిణీ చేయడాన్ని తప్పుబట్టారు. నాణ్యతతో కూడిన ఆహారాన్ని పంపిణీ చేయాలని కోరుతూ రిమ్స్‌ అధికారి రమేష్‌కు వినతిపత్రం సమర్పించారు.

సహకార రంగంపై

ప్రచారం అవసరం

రాయచూరు రూరల్‌: నేటి పోటీ యుగంలో విద్యార్థులు సహకార రంగం గురించి ప్రచారం చేయాలని సహకార మహా మండలి జిల్లాధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జరిగిన సహకార రంగ విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి వెలిగించి మాట్లాడారు. సమాజంలో మహిళలు, యువతులు సహకార రంగంలో స్పందించాలన్నారు. సమావేశంలో కల్లయ్య స్వామి, తిమ్మారెడ్డి, విద్యాసాగర్‌లున్నారు.

కేంద్రం జీఎస్టీ తగ్గింపుపై హర్షం

రాయచూరు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ విధించిన జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపుపై ఎల్‌ఐసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. గురువారం ఎల్‌ఐసీ డివిజన్‌ కార్యాలయం వద్ద ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శరణగౌడ, కార్యదర్శి రవి మాట్లాడారు. ఎల్‌ఐసీ ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై విధించిన జీఎస్టీని తగ్గించాలని చేపట్టిన ఆందోళనలపై స్పందించి నేడు కేంద్రం జీఎస్టీని తగ్గించడం హర్షణీయమన్నారు.

అనుమానాస్పద  రీతిలో నక్సలైట్‌ అరెస్ట్‌ 1
1/3

అనుమానాస్పద రీతిలో నక్సలైట్‌ అరెస్ట్‌

అనుమానాస్పద  రీతిలో నక్సలైట్‌ అరెస్ట్‌ 2
2/3

అనుమానాస్పద రీతిలో నక్సలైట్‌ అరెస్ట్‌

అనుమానాస్పద  రీతిలో నక్సలైట్‌ అరెస్ట్‌ 3
3/3

అనుమానాస్పద రీతిలో నక్సలైట్‌ అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement