
కారు, బైక్ ఢీ.. ఇద్దరు మృతి
చెళ్లకెరె రూరల్: కారు, బైక్ ముఖాముఖి ఢీకొనడంతో ఇద్దరు స్థలంలోనే మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన చెళ్లకెరె సమీపంలో జాతీయ రహదారి 150ఏలో సంభవించింది. తళకు గ్రామం నుంచి హిరియూరు వైపునకు వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న అభిషేక్ (31), మంజుల(30) స్థలంలోనే మృతి చెందారు. కారు డ్రైవర్ గోవిందరెడ్డప్పకు తీవ్ర గాయాలైనందున చెళ్లకెరె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. స్థలానికి ఇన్‌స్పెక్టర్ కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ దారప్ప వెళ్లి పరిశీలించారు. ఘటనపై చెళ్లకెరె పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది.

కారు, బైక్ ఢీ.. ఇద్దరు మృతి