
మైనింగ్‌తో పర్యావరణానికి చేటు
చెళ్లకెరె రూరల్: జిల్లాలో మైనింగ్ కంపెనీల కార్యకలాపాలతో పరిసరాలపై దుష్పరిణామం పడింది. మీ ధోరణి మార్చుకోక పోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చిత్రదుర్గ లోక్‌సభ సభ్యుడు గోవింద కారజోళ హెచ్చరించారు. ఆయన గురువారం పావగడ రోడ్డులో నాగరిక హితరక్షణ వేదిక, రైతు సంఘాలు, బీజేపీ ఏర్పాటు చేసిన స్టీల్ కంపెనీలు నడుపుతున్న మైనింగ్‌ను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. వారు నిర్వహిస్తున్న మైనింగ్ వల్ల రైతుల పంటలకు హాని జరుగుతోంది. మట్టి, ధూళి వల్ల ప్రజలు రోగాలకు గురవుతున్నారు. ఈ మైనింగ్ కంపెనీ యజమానులు ఇతర జిల్లాల వాహనాలను ఉపయోగిస్తున్నందున ట్రాక్టర్, టిప్పర్ డ్రైవర్లు నిరుద్యోగులు అయ్యారు. మైనింగ్ నుంచి వచ్చే ధూళి వల్ల దగ్గరలోనే ఉన్న పాఠశాలకు, ప్రజలపై దుష్పరిణామం పడుతోందన్నారు. ఎమ్మెల్యే కుమ్ముక్కు వల్లే ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేటీ కుమారస్వామి, బీజేపీ నాయకులు సోమశేఖర్ మండిమట్, జయపాలయ్య, సూరనహళ్లి శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.