
ద్రోణాచార్య అవార్డు ప్రదానం
రాయచూరు రూరల్: సాహిత్య రంగంలో విశేష సేవలు అందించిన జిల్లాలోని మాన్వి తాలూకా చీకలపర్వికి చెందిన నిహారికకు ద్రోణాచార్య అవార్డు లభించింది. ఈనెల 13న బెంగళూరులో కావ్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ పదాధికారులు ఆమెకు అవార్డు ఇచ్చి సత్కరించారు. కన్నడ భాష, సాహిత్య రంగంలో నిహారిక సేవలను గుర్తించి అవార్డును అందించారు.
నేడే జూనియర్ చిత్రం విడుదల ●
● గాలి జనార్దనరెడ్డి తనయుడు
కిరీటిరెడ్డి తొలి సినిమా
సాక్షి, బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి తనయుడు గాలి కిరీటిరెడ్డి నటించిన తొలి చిత్రం జూనియర్ శుక్రవారం విడుదల కానుంది. హీరోయిన్‌గా శ్రీలీల, మెయిన్ క్యారెక్టర్‌గా జెనీలియా, కన్నడ నటుడు రవిచంద్రన్ తదితరులు ఇందులో నటించారు. దేశ, విదేశాల్లో 1116 థియేటర్లలో ప్రదర్శించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేశారు. బళ్లారిలో అభిమానులు కౌటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాధిక, నటరాజ్ గ్రూప్ థియేటర్లలో చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో జూనియర్ సినిమా రిలీజ్ కానుంది.
ఇల్లు కూలి చిన్నారి మృతి ●
● ఐదుగురికి గాయాలు
సాక్షి,బళ్లారి: భారీ వర్షంతో ఇల్లు కూలి ఓ చిన్నారి మృతి చెందడంతో పాటు ఐదు మందికి గాయాలయ్యాయి. కొప్పళ జిల్లా గంగావతి తాలూకా హెబ్బాళ గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో ప్రశాంతి అనే చిన్నారి మృతి చెందగా, హనుమంతు, దుర్గమ్మ, భీమమ్మ, హుసేనప్ప, ఫక్కీరప్ప అనే ఐదుగురు గాయపడ్డారు. ఘటనపై గంగావతి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటుతో యువతి..
రాయచూరు రూరల్: గుండెపోటుతో ఓ యువతి మరణించిన ఘటన కొప్పళలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి శివగంగా కాలనీలో నివాసముంటున్న మంజుల హూగార్(26) గుండెపోటుకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. ఆమె ఇటీవల వరకు బెంగళూరులో పని చేస్తుండేది. అక్కడ పని వదిలిపెట్టి ఇటీవలే కొప్పళకు వచ్చింది. తల్లిదండ్రులు బస్టాండ్‌లో పూల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు.
దుర్గమ్మ గుడి హుండీల లెక్కింపు
బళ్లారిఅర్బన్: నగర ప్రజల ఆరాధ్య దేవత కనకదుర్గమ్మ దేవస్థానంలోని 13 హుండీల్లోని కానుకలను గురువారం తెరిచి ఆలయ ఈఓ హనుమంతప్ప సారథ్యంలో లెక్కించారు. బళ్లారి ఏసీ, ఆలయ పాలన అధికారి ప్రమోద్, ధర్మదాయ శాఖ ఏసీ సవిత, గ్రేడ్– 2 తహసీల్దార్ సమక్షంలో హుండీలను తెరిచారు. సదరు కానుకలను లెక్కించగా నాలుగు నెలల అవధిలో సుమారు రూ.67,86,179 కానుకలు లభించాయని ఆలయ ఈఓ హనుమంతప్ప తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఇబ్బంది, హోంగార్డ్‌లు పాల్గొన్నారు. కాగా ఈ మొత్తం ప్రక్రియ సీసీ కెమెరాల నిఘాలో తగిన బందోబస్తు మధ్య చేపట్టారు.
శ్రీపాదంగళ్ దండోదక స్నానం
రాయచూరు రూరల్: మంత్రాలయంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ బుధవారం తుంగభద్ర నదిలో దక్షియానం సందర్భంగా దండోదక స్నానం ఆచరించారు. అనంతరం మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల మఠంలో మూల విరాట్‌కు ప్రత్యేక పూజలు నెరవేర్చారు.

ద్రోణాచార్య అవార్డు ప్రదానం

ద్రోణాచార్య అవార్డు ప్రదానం

ద్రోణాచార్య అవార్డు ప్రదానం

ద్రోణాచార్య అవార్డు ప్రదానం

ద్రోణాచార్య అవార్డు ప్రదానం