
వీధి కుక్కల స్వైరవిహారం
● దేవసూగూరులో
నలుగురికి గాయాలు
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా దేవసూగూరులో వీధి కుక్కలు స్వైరవిహారం చేయడంతో నలుగురికి గాయాలయ్యాయి. గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ వార్డుల్లో వీధి కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంజిరెడ్డి(30), నాగవేణి(40), రాజశేఖర్(22)తో పాటు వీధి కుక్కల దాడిలో 10 మంది గాయపడిన విషయం విదితమే. గ్రామ పంచాయతీ, జిల్లా యంత్రాంగం వీధి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు.

వీధి కుక్కల స్వైరవిహారం

వీధి కుక్కల స్వైరవిహారం