
ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం
శివాజీనగర: రాజధానిలో అధికమవుతున్న ట్రాఫిక్ సమస్య నివారణకు అత్యవసర, దీర్ఘకాల చర్యలను చేపట్టనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందు అత్యవసర చర్యల ద్వారా రద్దీని తగ్గిస్తామని చెప్పారు. నగరంలో బేసిక్ పోలీసింగ్‌కు పెద్దపీట వేస్తాము, పోలీస్ సిబ్బంది ఇతర పనులు చేయడాన్ని అరికడతామన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరి సమస్యను తీవ్రంగా పరిగణించి పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. స్టేషన్‌కు వచ్చే ఎవరినీ నిర్లక్ష్యం చేయరాదు, అందులో మహిళలు, పిల్లల సమస్యలపై మరింత జాగ్రత్తలు తీసుకొని పని చేయాలని చెప్పానన్నారు. సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించటం, మత భావాలను రెచ్చగొట్టడం, మహిళల గౌరవానికి భంగం కలిగించే సామాజిక మాధ్యమ పోస్ట్‌లపై చర్యలు తప్పవన్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్లను కనిపెట్టడం, ప్రజల్లో అవగాహన పెంచటం ద్వారా సైబర్ నేరాలను తగ్గించవచ్చన్నారు. బైక్ వీలింగ్‌కు పాల్పడేవారిని అడ్డుకుంటామని, వీలింగ్‌కు అనుకూలమయ్యేలా బైక్‌లను చేసే మెకానిక్‌ల మీద చర్యలు తీసుకొంటామని తెలిపారు. రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగించేలా కార్యక్రమాలు చేసేవారిని అడ్డుకుంటామని తెలిపారు.
నగర పోలీస్ కమిషనర్
ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం