
పరిహారం కోసం రైతుల ధర్నా
రాయచూరు రూరల్: భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేశారు. గురువారం మస్కి తాలూకాలోని గోనవార వద్ద చేపట్టిన ఆందోళనలో శరణప్ప ఉద్బాళ మాట్లాడారు. భారత్ మాలా పథకంలో నిర్మాణాలు చేపడుతున్న జాతీయ రహదారి పనులకు రైతుల నుంచి భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు రైతులకు పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో భూస్వాధీన అధికారులు, రైతుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. లింగసూగూరు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ ఆధ్వర్యంలో పోలీసుల కవాతుతో రైతు సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించారు. రైతుల భూములను పోలీస్ రెవెన్యూ శాఖాధికారులు బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. లింగసూగూరు ఏసీ, డీఎస్పీ, తహసీల్దార్ల ఆధ్వర్యంలో భూములను స్వాధీనం చేసుకున్నారు.