
మొబైల్ వ్యసనానికి మరో బాలుడు బలి
యశవంతపుర: మొబైల్‌ఫోన్‌కు అలవాటుపడిన బాలలు పెద్దలు మందలించారని ఆత్మహత్యలకు వెనుకాడడం లేదు. హావేరి జిల్లాలో ఓ బాలుని ఆత్మహత్య మరువకముందే ఉత్తరకన్నడ జిల్లా హళియాళ మంగళవాడి గ్రామంలో మరో ఘోరం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓం కదం (13), ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రోజూ పాఠశాల అయిపోగానే మొబైల్‌తో కాలక్షేపం చేసేవాడు. ఎక్కువసేపు ఫోన్ చూడవద్దని తండ్రి మనోహర్ బుద్ధిమాటలు చెప్పాడు. దీంతో ఆక్రోశం చెందిన బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.