
హంపీలో మళ్లీ కూల్చివేతలు షురూ
హొసపేటె: హంపీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాంతంలో మళ్లీ జేసీబీల రణగొణ ప్రారంభమైంది. అక్రమ భవనాల తొలగింపునకు అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని సణాపుర, విరుపాపుర గడ్డ ప్రాంతాల్లో ఆరు అక్రమ హోంస్టేలు, రిసార్ట్‌లు తొలగించారు. హొసపేటె తాలూకాలోని వెంకటాపుర ప్రాంతంలో ఒక హోంస్టేను తొలగించారు. కొప్పళలోని విరుపాపుర గడ్డ ప్రాంతంలో ఒక అక్రమ హోంస్టేను బుధవారం హంపీ అథారిటీ తొలగించింది. మోడల్ గొర్రెల షెడ్ యజమాని స్వచ్ఛందంగా దానిని తొలగించారు. మరో హోంస్టేను తొలగించాలని అధికారులు ఆదేశించారు. దానిని తొలగించక పోతే తామే తొలగిస్తామని హెచ్చరించారు. హంపీ అథారిటీ కమిషనర్ రమేష్, గంగావతి తహసీల్దార్ నాగరాజ్, పీడీఓ రాజేశ్వరి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్ తదితరులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
25 అక్రమ రిసార్ట్‌లు, హోంస్టేలు,
రిసార్ట్‌ల గుర్తింపు
హంపీ డెవలప్‌మెంట్ అఽథారిటీ
ఆపరేషన్ ప్రారంభం
కార్యాచరణలో 7 అక్రమ హోంస్టేలు, రిసార్ట్‌ల తొలగింపు

హంపీలో మళ్లీ కూల్చివేతలు షురూ