
బైక్‌చోదకులపై కొరడా
రాయచూరు రూరల్: జిల్లాలో ద్విచక్రవాహనదారులు మంగళవారం నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాయచూరు జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య ఆదేశం మేరకు పోలీసులు హెల్మెట్ ధరించని వారిపై కొరడా ఝళిపించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్‌ను ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని విన్నవించినా హెల్మెట్‌ను ధరించని వారి నుంచి రూ.500 చొప్పున జరిమానా విధించడంతో మంగళవారం ఒకే రోజు రూ.55 వేలు వసూలు అయిందని ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు.
గదగ్‌లో లవ్ జిహాద్ రభస
● భార్యపై భర్త ఫిర్యాదు
సాక్షి, బళ్లారి: గదగ్ జిల్లాలో విచిత్రమైన లవ్ జిహాద్ ఉదంతం వెలుగు చూసింది. ముస్లిం యువతి, హిందూ యువకుడిని ప్రేమించింది. వారిద్దరూ పరారై, పెళ్లి చేసుకోవడాన్ని లవ్ జిహాద్‌గా పిలుస్తున్నారు. అయితే గదగ్‌లో జరిగిన విచిత్ర ఘటనలో ముస్లిం యువతి హిందూ యువకుడిని పెళ్లి చేసుకుని, అతనిని ఇస్లాం మతానికి మత మార్పిడి చేయాలని ప్రయత్నం చేసింది. ఈమేరకు ఆ యువకుడే ఆరోపణలకు దిగారు. వివరాలు.. తహసీన్ హొసమనె అనే యువతిని విశాల్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. గదగ్‌లోని గాంధీనగర్ సెటిల్‌మెంట్ ఏరియాకు చెందిన విశాల్‌కుమార్, తహసీన్‌తో గత ఏడాది నవంబర్ 24న రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. ఆమె కోరిక మేరకు ఏప్రిల్ 25న ముస్లిం సంప్రదాయం ప్రకారం తిరిగి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సందర్భంగా తన పేరు మార్చారని, మత సంప్రదాయాలను పాటించాలని భార్య, అత్త బలవంతం చేస్తున్నారని విశాల్ కుమార్ ఆరోపించారు. విశాల్‌కు మద్దతుగా హిందూ సంఘాలు గదగ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
పోలీసులకు ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తా●
● నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి
బళ్లారి అర్బన్: డీఏఆర్ ఆవరణలో బుధవారం రూ.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 36 పోలీస్ సిబ్బంది వసతి గృహాల నిర్మాణ పనులకు నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి భూమిపూజ నెరవేర్చి పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు పగలు రాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తు ప్రజలను, వారి కుటుంబాలను రక్షిస్తారన్నారు. అలాంటి పోలీసు అధికారులకు, సిబ్బందికి వారిలో శాంతి, సంతృప్తి కోసం కృషి చేయడం తన ప్రథమ కర్తవ్యం అన్నారు. మొత్తం 36 ఇళ్లు రూ.8 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత కాపాడుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. ఐజీపీ వర్థిక కటియార్, ఎస్పీ డాక్టర్ శోభారాణి, ఏఎస్పీ రవికుమార్, డీఎస్పీ నందారెడ్డి, కాంగ్రెస్ ప్రముఖులు సుబ్బారాయుడు, చానాళ్ శేఖర్, హగరి గోవింద తదితరులు పాల్గొన్నారు.
కార్యాచరణ ప్రణాళిక
సత్వర పూర్తికి సూచన
హొసపేటె: తాలూకా స్థాయి అధికారులను తమ విజయాలను కాగితంపై చూపించడమే కాకుండా తమ విజయాలను భౌతికంగా చూపించాలని, కొత్త కార్యాచరణ ప్రణాళికను సకాలంలో పూర్తి చేయాలని కంప్లి అసిస్టెంట్ కమిషనర్ కావ్యరాణి తెలిపారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన తాలూకా స్థాయి అధికారులతో ప్రగతి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అందరు అధికారులు ముందస్తు తయారీతో వారి విభాగానికి సంబంధించిన అవసరమైన డేటాతో సమావేశానికి రావాలి. విభాగాధిపతులు ఎటువంటి కారణాలు చెప్పకుండా సమావేశానికి రావాలి. శాఖ ఎదుర్కొంటున్న సమస్యలు, శాఖ ప్రాజెక్టుల గురించి శాఖ తగిన సమాచారాన్ని అందించాలని తెలిపారు. తాలూకాలో 39 అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, స్థానిక సంస్థలు అంగన్‌వాడీ కేంద్రాలకు స్థలం అందించాలని మహిళా సూపర్‌వైజర్ లతీఫా బేగంకు సూచించారు. విద్యా శాఖపై చర్చకు వచ్చినప్పుడు, తాలూకా ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫలితాలను మెరుగుపరచడానికి ఏమి చర్యలు తీసుకున్నారని అడిగినప్పుడు, ఈసీఓ టీఎం బసవరాజ్ అవసరమైన చర్యలు గురించి సమాచారం ఇచ్చారు. ఈ సారి 90 శాతం ఫలితాలు సాధించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జూగుల మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

బైక్‌చోదకులపై కొరడా

బైక్‌చోదకులపై కొరడా

బైక్‌చోదకులపై కొరడా