
యరగేరలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయరూ
రాయచూరు రూరల్: జిల్లా కేంద్రం రాయచూరు నుంచి 25 కి.మీ దూరంలోని యరగేరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్‌సీ)న్ని ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. బుధవారం నాడా కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మహ్మద్ అనీస్ మాట్లాడారు. ప్రజలకు అనుకూలమయ్యే విధంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి సౌకర్యాలు ఉన్నాయన్నారు. యరగేర పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, 78 గ్రామాలు ఉన్నాయన్నారు. పీహెచ్‌సీని ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రికి తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో ఇక్బాల్, భీమేష్, జిలాని, చంద్రశేఖర్, అప్పు, ఫయాజ్‌లున్నారు.
కార్యకర్తలకు మండళ్లలో చోటు కల్పించాలి
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని కార్యకర్తలకు బోర్డులు, కార్పొరేషన్ల పదవుల్లో చోటు కల్పించాలని కేపీసీసీ వెనుక బడిన వర్గాల విభాగం ఉపాధ్యక్షుడు టి.మారెప్ప డిమాండ్ చేశారు. బుధవారం బెంగళూరులో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గేకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. పార్టీలో క్రమశిక్షణతో పని చేసిన కార్యకర్తలకు అవకాశం కల్పించాలని విన్నవించారు.
మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత
రాయచూరు రూరల్: మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకా మారడగి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం వండిన వంటలను విద్యార్థులు భోజనం చేశారు. అయితే కాసేపటికే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 117 మంది విద్యార్థుల్లో 68 మంది విద్యార్థులు భోజనం చేయగా వారిలో కడుపునొప్పితో బాధపడుతున్న 22 మందిని ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చేరిన విద్యార్థులను తహసీల్దార్ మల్లన్న, తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ ఉమేష్ శర్మ, ఎస్‌ఐ గజానన, డీడీపీఐలు పరామర్శించారు.
ఆర్టీఓ కార్యాలయంపై లోకాయుక్త దాడి
రాయచూరు రూరల్: నగరంలోని ప్రాంతీయ రవాణా అధికారి(ఆర్టీఓ) కార్యాలయంపై లోకాయుక్త అధికారులు దాడి చేసి తనిఖీ చేశారు. బుధవారం లోకాయుక్త డీఎస్పీ రవి పురుషోత్తం ఆధ్వర్యంలో ప్రజల ఫిర్యాదు మేరకు ఆర్టీఓ కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు ఏవిధంగా పని చేస్తున్నారనే అంశంతో పాటు పెండింగ్‌లో ఉన్న రికార్డులను కూడా పరిశీలించారు.
గుండెపోటుతో
యువకుడు మృతి
రాయచూరు రూరల్: గుండెపోటుతో ఓ యువకుడు మరణించిన ఘటన విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం విజయపుర జిల్లా శివణిగి గ్రామానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి బసవరాజ్(18) ఇంటిలోనే గుండెపోటు రావడంతో మరణించాడు. అతనిని టీ తాగమని తల్లి ఎంతగా లేిపినా లేవక పోవడంతో దుఃఖం కట్టలు తెంచుకుంది.

యరగేరలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయరూ

యరగేరలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయరూ

యరగేరలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయరూ

యరగేరలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయరూ