
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై అట్రాసిటీ కేసా?
రాయచూరు రూరల్: తనకు అన్యాయం జరిగిందంటూ చేసిన ఫిర్యాదును స్వీకరించాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారని జనవాది మహిళా సంఘం అధ్యక్షురాలు శకుంతలా పాటిల్ తప్పుబట్టారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవదుర్గ తాలూకా మూడలగుండాలో రాధ స్నానం చేస్తున్న సమయంలో రామన్న చూశాడని, దానిని అడిగినందుకు ఆమెను చెంప దెబ్బ కొట్టిన రామన్న బలవంతంగా రాధపై అట్రాసిటీ కేసు నమోదు చేయించారని ఆరోపించారు. ఈ నెల 6న ఘటన చోటు చేసుకోవడంతో 7న పోలీస్ స్టేషన్‌లో జనవాది మహిళా సంఘం ఆధ్వర్యంలో కేసు నమోదు చేశామన్నారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా 8న రాధపై అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. మహిళలకు న్యాయం చేయకుండా తప్పుడు కేసులు బనాయించారని, రామన్నను అరెస్ట్ చేయాలన్నారు.