
దివికేగిన ధృవతార
బనశంకరి: కన్నడ, తెలుగు సహా అలనాటి మేటి బహు భాషా నటీమణి బి.సరోజాదేవి (87) సోమవారం కన్నుమూశారు. మంగళవారం రామనగర సమీపంలో చెన్నపట్టణ వద్ద దశావర గ్రామంలో సరోజాదేవి పార్థివదేహానికి అంత్యక్రియలు జరుగుతాయి. వయోభారంతో కూడిన అనారోగ్యాల వల్ల బాధపడతున్న సరోజాదేవి బెంగళూరులో మల్లేశ్వరంలోని తమ నివాసంలో శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. ఆమె లేరన్న విషయం తెలియగానే వందలాది మంది అభిమానులు అక్కడికి తరలివచ్చారు. అంతిమ దర్శనం కోసం అక్కడే ఉంచారు. సరోజా దేవి భర్త 1987లో మరణించారు. ఆయన సమాధి పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.
ప్రముఖుల నివాళులు
సరోజాదేవి నిష్క్రమణంతో కన్నడ సినీ అభిమానులు, ప్రజలు తీవ్ర విచారానికి లోనయ్యారు. రాజకీయ, చిత్రరంగ ఉద్ధండులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎంతోమంది ప్రముఖ నటులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
బహుబాషానటి బీ. సరోజాదేవి కన్నుమూత
అందచందాలు, నటనా కౌశల్యం, ఆత్మవిశ్వాసం, సహనం వంటి అనేక సుగుణాల కలబోతే బి.సరోజాదేవి. సినిమాలలోకి అడుగుపెట్టడానికి మహిళలు సంశయించే రోజుల్లో ధైర్యంగా నటనా రంగాన్ని ఎంచుకుని వెండితెర మీద యువరాణిలా మెరిశారు. ఆమె కన్నడిగురాలైనా తెలుగువారి నీరాజనాలు అందుకోవడం మరో విశేషం.

దివికేగిన ధృవతార

దివికేగిన ధృవతార

దివికేగిన ధృవతార