
సబ్బు, సుందరి.. ఓ అల్లరి
యశవంతపుర/ మైసూరు: మైసూరు శాండల్ సబ్బు ప్రచారకర్తగా ప్రముఖ అందాల తార తమన్నా భాటియాను ప్రభుత్వ రంగ కెఎస్‌డిఎల్ సంస్థ ఎంపిక చేయడంపై రోజురోజుకూ తీవ్ర వివాదమవుతోంది. అనేకమంది ప్రతిపక్ష నాయకులు, కన్నడ సంఘాల నేతలు నిరసన తెలుపుతున్నారు. శుక్రవారం బెంగళూరులో కర్ణాటన రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణగౌడ మాట్లాడుతూ మైసూరు శాండల్ ప్రచారకర్తగా తమన్నాకు రూ.6.2 కోట్ల ఫీజును చెల్లించడం అవివేకమని ఆరోపించారు. ప్రభుత్వానిది బాధ్యతా రాహిత్యమని ధ్వజమెత్తారు.
కన్నడ సంఘాల ర్యాలీ
మైసూరు సోప్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటి తమన్నా నియామకాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ సంఘాలు ఆందోళన చేశాయి. బెంగళూరులో యశవంతపుర నుంచి సోప్స్ ఫ్యాక్టరీ వరకు ఊరేగింపు నిర్వహించారు. కన్నడ నటీమణులను కాదని బాలీవుడ్ నటిని ఎంపిక చేయరాదని నినాదాలు చేశారు. తక్షణం ఒప్పందాన్ని రద్దు చేసి కన్నడ నటీనటులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.
పిచ్చికి పరాకాష్ట: ఎంపీ యదువీర్
నటి తమన్నా భాటియాకు కర్ణాటక సంస్కృతి , చరిత్రతో ఎలాంటి సంబంధం లేదని, కన్నడ భాష కూడా తెలియదు, అలాంటి నటిని మన గంధంతో చేసిన సబ్బులకు ప్రచారకర్తగా చేయాల్సిన అవసరం ఏమిటి అని రాజవంశీకుడు, మైసూరు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మైసూరు మహారాజు నాళ్వడి కృష్ణరాజ ఒడెయార్ స్థాపించిన సంస్థలో ఒకటి అయిన మైసూరు సోప్స్, డిటర్జెంట్స్ సంస్థకు పరాయి భాషలకు చెందిన తమన్నా ను ప్రచార రాయబారిగా నియమించడం సరికాదని, ఇది కన్నడిగులను అవమానించడమే ఆరోపించారు. 1916లో మైసూరు రాజు సంస్థ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారన్నారు. ఈ సంస్థ సబ్బులు ఎంతోమంది ప్రజల మన్ననలు పొందాయని చెప్పారు. కన్నడిగుల అమూల్యమైన ఉత్పత్తులకు పర భాషా నటిని ప్రచారానికి నియమిండం పిచ్చికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ఆమెకు రూ. 6 కోట్ల ను చెల్లిస్తారని, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. కన్నడలో ఎంతో నటీనటులు ఉన్నారని, వారిని అవమానించడమేనని విమర్శించారు.
సర్కారు తయారుచేసే మైసూరు శాండల్ ఉత్పత్తులకు గతంలో ఎంతోమంది ప్రముఖ నటీమణులు ప్రచారకర్తలుగా కనిపించారు. ఇప్పుడు బాహుబలి సుందరి తమన్నా ఎంపికై ంది, అంతే పెద్ద రగడ మొదలైంది. కన్నడ నటీమణులే లేరా అని విపక్ష నేతలు, కన్నడ సంఘాలు అభ్యంతరం తెలిపాయి.
కియారా అద్వానీ, పూజా హెగ్డే ఈ డీల్ వద్దన్నారు. దీపక, రశ్మిక మందణ్ణ కూడా చేయం అన్నారు, అందుకే తమన్నాను ఎంచుకున్నాం అని సర్కారు చెబుతోంది. ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో!
మైసూరు శాండల్ ప్రచారకర్తగా నటి తమన్నా
ఇందుకు రూ. 6 కోట్ల పారితోషికం
భగ్గుమన్న కన్నడ సంఘాలు
ఒప్పందానికి మన నటీమణులు
ఒప్పుకోలేదన్న మంత్రి ఎంబీ పాటిల్
రశ్మిక, దీపిక వద్దన్నారు – మంత్రి పాటిల్
వివాదం గురించి పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికీ తమన్నా భాటియాను ఎంపిక చేసిన్నట్లు చెప్పారు. సంస్థ వ్యాపారాన్ని రూ. 5 వేల కోట్లకు చేర్చాలన్నదే లక్ష్యమని, అందుకే తమన్నాను ఎంపిక చేశాం. పూజా హెగ్డే, కియారా అద్వాని ప్రచారకర్తగా చేయడానికి నిరాకరించారు. దీపికా పదుకొణె మా బడ్జెట్‌కు ఒప్పకోలేదు. రశ్మిక మందణ్ణ కూడా తిరస్కరించారు. కన్నడ కళాకారులపై ప్రభుత్వానికి గౌరవం ఉందని మంత్రి తెలిపారు.

సబ్బు, సుందరి.. ఓ అల్లరి

సబ్బు, సుందరి.. ఓ అల్లరి

సబ్బు, సుందరి.. ఓ అల్లరి