
హంపీ, టీబీ డ్యాంలో హై అలర్ట్
హొసపేటె: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర పేరుతో దాడి నిర్వహించిన తర్వాత హంపీ, తుంగభద్ర రిజర్వాయర్, రైల్వేస్టేషన్‌తో సహా పర్యాటక ప్రదేశాల్లో హై అలర్ట్ విధించారు. విజయనగర పోలీసు శాఖ ప్రతి చోటా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. హంపీ విరుపాక్షేశ్వర ఆలయం, తుంగభద్ర డ్యాం వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్)తో భారీ భద్రత కల్పించారు. రిజర్వాయర్ దగ్గర అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక పోలీసులు కూడా గస్తీని పెంచారు.
హుబ్లీ రైల్వే స్టేషన్‌లో హైఅలర్ట్
హుబ్లీ: భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హుబ్లీ సిద్దారూఢ రైల్వే స్టేషన్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. రైల్వే రక్షణ సేన, రైల్వే పోలీసులు, డాగ్ స్క్వాడ్‌తో నిరంతరంగా పహారా కాస్తున్నారు. ప్రయాణికులు, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. హ్యాండ్‌హెల్డ్, డోర్‌ఫ్రేమ్ మెడల్ డిటెక్టర్, లగేజీ తనిఖి స్క్యానర్ల ద్వారా అణువణువు పరిశీలిస్తున్నారు. రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం, బయటకు వెళ్లే దారుల్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. రైల్వే బోగీల వద్దకు వెళ్లి ప్రతి చిన్న చితకా వస్తువులను డేగకళ్లతో పరిశీలిస్తున్నారు. స్టేషన్ చుట్టుపక్కల 10 చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.

హంపీ, టీబీ డ్యాంలో హై అలర్ట్

హంపీ, టీబీ డ్యాంలో హై అలర్ట్