
నాటక కళను బతికించుకోవాలి
రాయచూరు రూరల్: నాటక రంగానికి ప్రాణం పోయాలని కిల్లేబృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు సూచించారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో స్ఫూర్తి నాట్య అకాడమీ ఏర్పాటు చేసిన సాంస్కతిక, నృత్య, గాన, సంగీతోత్సవాలను స్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. చిన్నప్పటినుంచే కళలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. నాటక రంగాన్ని ఆదరించి భావితరాలకు అందిచాలన్నారు. అనంతరం కళాకారుల ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చంద్రశేఖర్, రాజా శ్రీనివాస్, సంగమేష్, జంగ్లప్ప గౌడ, పరిమళరెడ్డి, రేఖ, పుష్పావతి, మల్లికార్జున, దండెప్ప పాల్గొన్నారు.
ఇద్దరు నర్సింగ్ విద్యార్థుల దుర్మరణం
సాక్షి,బళ్లారి: చిత్రదుర్గం నగరంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యాసిన్(22),అల్తాఫ్(22) అనే నర్సింగ్ విద్యార్థులు బైక్‌పై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఢీ కొంది. తీవ్ర గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాఫిక్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దళితుల్లో చైతన్యం నింపిన సిద్దలింగయ్య
రాయచూరు రూరల్: రాజ్యాగ నిర్మాత అంబేడ్కర్ బాటలో నడిచిన దివంగత సాహితీవేత్త డాక్టర్ సిద్దలింగయ్య జీవన విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కవి బాబు బండారిగల్ అన్నారు. సిద్దలింగయ్య జీవన విధానంపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమన్వయ సమితి ఆదివారం నగరంలోని ఎన్‌జీఓ సభా భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితుల సమస్యలను తన బాధలుగా భావించిన సిద్దలింగయ్య తన సాహిత్యం ద్వారా దళితుల్లో చైతన్యం నింపారన్నారు. ఆయన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. సమన్యయ సమితి అధ్యక్షుడు జిందప్ప, కార్యదర్శి సంతోస్, ఈరణ్ణ, అణ్ణప్ప మేటి, బషీర్ అహ్మద్ పాల్గొన్నారు.
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.74 లక్షలు
బళ్లారిఅర్బన్: బళ్లారి శ్రీ కనకదుర్గమ్మ హుండీని లెక్కించినట్లు ఈఓ హనుమంతప్ప తెలిపారు. గత ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి ఈ నెల 21 వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.74,21,390 ఆదాయం లభించినట్లు తెలిపారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల మధ్య హుండీ లెక్కింపు జరిగిందన్నారు. గతంలో పోల్చుకుంటే ఈ సారి హుండీ ఆదాయం భారీగా పెరిగిందన్నారు.
అయ్యప్ప స్వామి సేవా సమాజం జిల్లా శాఖప్రారం
బళ్లారిటౌన్: నగరంలోని విద్యానగర్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ శబరిమలై అయ్యప్ప సేవా సమాజం జిల్లా శాఖను కమ్మరిచెడు కళ్యాణ స్వామి చేతులు మీదుగా ప్రారంభించారు. జిల్లా శాఖ అధ్యక్షుడిగా రాంబాబు గురుస్వామిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాష్, ఉపాధ్యక్షుడు సంపత్‌కుమార్, స్థానిక ఆలయం ట్రస్ట్ అధ్యక్షుడు వై.భాస్కర్, ఉపాధ్యక్షుడు బోయపాటి విష్ణు, గురుస్వాములు సురేష, దత్త, మోహన్, రంగారెడ్డి, బీమ్‌రెడ్డి, నాగేష్, రామ్‌రెడ్డి, యోగి, మంజు, చల్లారమేష్, శ్రీనాథ్, సునిల్, ఆనందచౌదరి తదితరులు పాల్గొన్నారు.

నాటక కళను బతికించుకోవాలి

నాటక కళను బతికించుకోవాలి

నాటక కళను బతికించుకోవాలి

నాటక కళను బతికించుకోవాలి