కెజీఎఫ్: కోలారు జిల్లా కేజీఎఫ్ పట్టణంలోని ఇతిహాస ప్రసిద్ధ శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటరమణస్వామి దేవాలయ 90వ సంవత్సర పుష్పపల్లకీ మహోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. మొదలియార్ సముదాయికుల ఆధ్వర్యంలో వేడుక సాగింది. నగర వీధుల గుండా 15 గంటల పాటు పుష్ప పల్లకీ ఊరేగింపు సాగింది. పల్లకీ వాహనాన్ని మల్లెలు, కనకాంబరాలు తదితర పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. 5 నుంచి 6 టన్నుల పూలను ఉపయోగించారు. భక్తుల గోవిందనామ స్మరణ మధ్యన ఊరేగింపు సాగింది. పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
కేజీఎఫ్‌లో సంభ్రమం