పచ్చదనం పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

పచ్చదనం పెంపొందించాలి

Mar 19 2025 1:48 AM | Updated on Mar 19 2025 1:47 AM

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు పచ్చని చెట్లకు ప్రాధాన్యత కేటాయించి పరిసరాలను సంరక్షించాలని మర్చేడ్‌ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరేంద్ర పాటిల్‌ పేర్కొన్నారు. మంగళవారం తాలూకాలోని మర్చేడ్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమంలో వనసిరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో ఎండ నుంచి రక్షణ పొందడానికి ప్రతి ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. ఫౌండేషన్‌ అధ్యక్షుడు ప్రకాష్‌, సురేష్‌, ముక్త, వీణ, రాధిక, జగదీశ్‌, మహబూబ్‌ అలీలున్నారు.

సమాజంలో సీ్త్రలకూ

సమాన హక్కులు

రాయచూరు రూరల్‌: సదృఢ సమాజ నిర్మాణానికి పురుషులతో పాటు సీ్త్రలు కూడా సమానమని డయట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందిర పేర్కొన్నారు. సోమవారం కన్నడ భవనంలో సేవా జన శిక్షణ సంస్థాన, మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమావేశాన్ని జ్యోతి వెలిగించి మాట్లాడారు. మహిళలు విద్యా, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వీలుందన్నారు. సమావేశంలో సేవా జనశిక్షణ సంస్థాన అధికారి సదానంద ప్రభు, లావణ్య, జిల్లా జైలర్‌ అనితా హిరేమని, హుడేద్‌, శోభ, ఉమణ్ణ నాయక్‌, లక్ష్మిదేవి, కమలాక్షి, సతీష్‌ కుమార్‌లున్నారు.

ప్రాథమిక విద్యే గట్టి పునాది

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక యుగంలో ప్రాథమిక స్థాయిలో నేర్చుకునే విద్య విద్యార్థులకు గట్టి పునాది వంటిదని జెడ్పీ సీఈఓ రాహుల్‌ తుకారాం పాండే పేర్కొన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన చర్చాగోష్టిని జ్యోతి వెలిగించి మాట్లాడారు. పిల్లలు విద్యతో పాటు కళా, సాహిత్య, క్రీడా రంగాల్లో రాణించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. భవ్య భారత నిర్మాతలుగా రూపొందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యా శాఖాధికారులు బడిగేర, ఇందిర, శివమ్మ, గురురాజ్‌, ఆనంద్‌లున్నారు.

అక్రమ కట్టడ నిర్మాణం తగదు

రాయచూరు రూరల్‌: నగరంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కట్టడాల నిర్మాణాలు చేయడం తగదని కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వెనుక బడిన వర్గాల ఉపాధ్యక్షుడు తలెకాయ మారెప్ప ఆరోపించారు. మంగళవారం జవహర్‌ నగర్‌ తోట బావి వద్ద అక్రమంగా షెడ్లను నిర్మించడానికి తీసుకున్న చర్యలను ఖండించారు. ఆ ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు చేయరాదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన కార్పొరేషన్‌ అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి నిర్మాణాలకు అవకాశం కల్పించడాన్ని తప్పుబట్టారు. కట్టడాల నిర్మాణాలను నిలుపుదల చేయించాలని ఒత్తిడి చేశారు.

బాల కార్మికత నిర్మూలిద్దాం

రాయచూరు రూరల్‌: సదృఢ సమాజ నిర్మాణానికి బాల కార్మికత నిర్మూలనకు పాలకుల సహకారం అవసరమని జిల్లా అదనపు జడ్జి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు హెచ్‌.స్వాతిక్‌ పేర్కొన్నారు. సోమవారం దేవినగర్‌లో న్యాయ సేవా ప్రాధికార, కార్మిక శాఖ, ఎస్సీ, ఎస్టీ, సాంఘీక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పిల్లలు విద్యతో పాటు హక్కులు, విధులు, సమానత్వం, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. బాల కార్మిక శాఖాధికారులు ఆరతి, మంజునాథ్‌ రెడ్డి, శివప్ప, రుక్మిణి బాయి, అబ్దుల్‌ ఘనీలున్నారు.

పచ్చదనం పెంపొందించాలి 1
1/4

పచ్చదనం పెంపొందించాలి

పచ్చదనం పెంపొందించాలి 2
2/4

పచ్చదనం పెంపొందించాలి

పచ్చదనం పెంపొందించాలి 3
3/4

పచ్చదనం పెంపొందించాలి

పచ్చదనం పెంపొందించాలి 4
4/4

పచ్చదనం పెంపొందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement