
నూతన సంవత్సర పంచాంగాన్ని విడుదల చేస్తున్న అతిథులు
బళ్లారిఅర్బన్: జీవితానికి సార్థకత ఉండేది విద్య, పదవులు, గడించడం వల్ల కాదు, వీటిని చక్కగా సద్వినియోగం చేసుకొని సంస్కారం, సంస్కృతిని పెంపొందించుకోవాలని కమ్మరచేడుమఠం కళ్యాణ స్వామీజీ తెలిపారు. మంగళవారం బళ్లారి కలర్చల్ యాక్టివిటీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం సభాంగణంలో పండిత్ మఠంగురుప్రసాద్ సారథ్యంలో జరిగిన క్రోదినామ సంవత్సరం శ్రీ ఉమామహేశ్వర పంచాంగం ఆవిష్కరణ శుభవేళ కళ్యాణ స్వామి సానిధ్యం వహించి మాట్లాడారు. మఠం గురుప్రసాద్ ఎంతో భక్తిశ్రద్ధలతో నూతన పంచాంగాన్ని తీర్చిదిద్దారన్నారు. జీవితంలో ఎవరికి వారు తమ జీవితాలను సన్మార్గంలో సాగేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన వీవీ సంఘం నూతన అధ్యక్షుడు అల్లం గురుబసవరాజ్ మాట్లాడుతూ భారతీయ సనాతన సంస్కృతిలోనూ ఖగోళగ్రహ నక్షతాద్రి చలన వలనాల లెక్కలను వాస్తవంగా వెల్లడించడం మఠం గురుప్రసాద్‌కే చెల్లిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖులను ఘనంగా సన్మానించారు. అంతకు ముందు సూర్య కళా ట్రస్ట్ విద్యార్థినులు నిర్వహించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఉపాధ్యాయుడు సత్యనారాయణ, ఎంటీ మల్లేశప్ప, పద్మశాలి సంఘం జిల్లాధ్యక్షుడు అవార్ మంజునాథ్, కార్పొరేటర్ యశ్వంత్‌రాజ్, సంఘం పదాధికారులు పాల్గొన్నారు.