యువతిపై అత్యాచారం | - | Sakshi
Sakshi News home page

యువతిపై అత్యాచారం

Feb 6 2024 12:10 AM | Updated on Feb 6 2024 9:13 AM

- - Sakshi

దొడ్డబళ్లాపురం: యువతిపై అత్యాచారం చేసి, బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్న నిందితుడిని నెలమంగల పట్టణ పోలీసులు అరెస్టు చేసారు. నెలమంగల పట్టణంలో నివసిస్తున్న యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇంట్లో జొరబడ్డ నిందితుడు అత్యాచారం చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బీదర్‌కు చెందిన శివకుమార్‌ (25)ను అరెస్టు చేసారు. 2018లో ఉడుపిలో జరిగిన విశ్వహిందూ పరిషత్‌ కార్యక్రమంలో బాధిత యువతికి (అప్పుడు యువతి మైనర్‌ బాలిక) నిందితుడితో పరిచయం ఏర్పడింది. యువతి తల్లి వద్ద మొబైల్‌ నంబర్‌ తీసుకున్న శివకుమార్‌ తరచూ యువతికి కాల్‌ చేస్తూ మెసేజ్‌లు పంపించేవాడు.

ఈక్రమంలో 2018లో ఇంట్లో యువతి తప్ప ఎవరూ లేరని తెలుసుకున్న శివకుమార్‌ ఇంట్లో జొరబడి అత్యాచారం జరిపాడు. అత్యాచారం చేస్తూ ఫోటోలు తీసుకుని యువతిని బ్లాక్‌ ెుయిల్‌ చేస్తూ రూ.85 వేలు వరకూ డబ్బులు వసూలు చేసాడు. అయితే పదేపదే డబ్బులు అడుగుతుండడంతో యువతి తల్లితండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెంగళూరు చిక్కపేటలో శివకుమార్‌ను అరెస్టు చేసారు.

Advertisement
 
Advertisement
Advertisement