సినిమాకు మించిన ట్విస్టులు.. కారులో పెళ్లి.. అంతలోనే.. | - | Sakshi
Sakshi News home page

సినిమాకు మించిన ట్విస్టులు.. కారులో పెళ్లి.. అంతలోనే..

Jan 4 2024 1:18 AM | Updated on Jan 4 2024 9:13 AM

- - Sakshi

సినిమా తరహాలో కారులోనే ఓ ప్రేమ జంట వివాహం చేసుకోవడం సంచలనం కలిగించింది.

సాక్షి, బళ్లారి: సినిమా తరహాలో కారులోనే ఓ ప్రేమ జంట వివాహం చేసుకోవడం సంచలనం కలిగించింది. రాకింగ్‌ స్టార్‌ యశ్‌ నటించిన కిరాతక సినిమాలో ప్రేమ పెళ్లి జరిగిన విధంగా నగరంలో ఓ ప్రేమజంట కారులో మూడుముళ్లు వేసుకోవడం చూసి నగరవాసులు ఔరా అని నోరెళ్లబెట్టారు. కులాంతర వివాహం కావడంతో తల్లిదండ్రులు అడ్డు చెప్పడం వల్ల ప్రేమపక్షులు ఇలా చేశాయి.

కొప్పళ అమ్మాయి, బళ్లారి అబ్బాయి..
వివరాలు... కొప్పళ జిల్లాకు చెందిన యువతి అమృత, బళ్లారి జిల్లాలోని తెక్కలకోటకు చెందిన యువకుడు శివప్రసాద్‌ ఇద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరంటూ యువతి తల్లిదండ్రులు అడ్డు చెబుతూ వచ్చినా వారు పట్టించుకోలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని బళ్లారి నగరంలోని శాంతిధామ సాంత్వన కేంద్రం వద్దకు చేరారు. ఇద్దరు కారులో పూలదండలు మార్చుకొని పెళ్లి అయిందనిపించారు.

ఇరువర్గాల వాగ్వాదం..
ఇంతలో ఇరువర్గాల పెద్దలు వారిని అటకాయించారు. యువతి కొంతసేపు తనకు తల్లిదండ్రులు కావాలని, మరి కొంతసేపు ప్రేమికుడు కావాలని చెప్పడంతో గందరగోళం నెలకొంది. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం నడిచింది. వధూవరులు కూడా గొడవలో తలదూర్చడంలో హైడ్రామా సాగింది. పోలీసులు వచ్చి ప్రేమికులను తెక్కలకోట పోలీస్‌ స్టేషన్‌కు తరలించి మాట్లాడారు, తరువాత యువతిని శాంతిధామ కేంద్రానికి తరలించారు. ఈ పెళ్లి వీడియోలు, ఫోటోలు వైరల్‌ అయ్యాయి. పెళ్లయిన క్షణాల్లోనే జంటను విడదీయడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement