కోలారు: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను సదా స్మరించుకోవాలని, మేరా మిట్టి, మేరా దేశ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశభక్తిని చాటాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఎస్.సుధీర్ తెలిపారు. గురువారం తాలూకాలోని అరాభికొత్తనూరు గ్రామంలో జిల్లా లీడ్ బ్యాంకు, కెనరా బ్యాంకు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించిన మేరా మిట్టి, మేరా దేశ్ కార్యక్రమం సందర్భంగా మట్టి, బియ్యం సేకరణ అభియాన్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా దేశం కోసం ప్రాణాలతో పాటు తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన అమర వీరుల సేవలు అనన్యమన్నారు. ఈ అభియాన్ ద్వారా అన్ని ప్రాంతాల నుంచి బియ్యం, మట్టిని సేకరించి ఢిల్లీలో నిర్మిస్తున్న అమృత వాటిక స్థలానికి వినియోగిస్తారన్నారు. జీపీ అభివృద్ధి అధికారిణి శాలిని, అధ్యక్షురాలు రేణుకాంబ మునిరాజు, కెనరా బ్యాంకు సీనియర్ మేనేజర్ నాగరాజ్ పాల్గొన్నారు.