
అనంతపురంలో ఆగిన రైలు
● వందేభారత్ రైలు ట్రయల్ రన్
జయప్రదం
అనంతపురం సిటీ: కాచిగూడ– బెంగళూరు యశవంతపుర మధ్య ప్రయాణించే వందేభారత్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయోగాత్మక పరుగు విజయవంతమైంది. ఈ రైలు ట్రయల్ రన్‌లో భాగంగా గురువారం ఉదయం 10:45 గంటలకు అనంతపురం నగర రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అధికారులు, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. రైలు 10.50 గంటలకు బయలుదేరి ధర్మవరం మీదుగా యశవంతపురకి చేరింది. ఎనిమిది బోగీలతో వచ్చిన వందేభారత్ రైలు కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి బెంగళూరుకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందన్నారు. మొత్తం 610 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 8.30 గంటలు పట్టినట్లు అనంతపురం రైల్వే స్టేషన్ అధికారులు తెలిపారు. రైలును ఈ నెల 24 నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున నగర ప్రజలు చేరుకుని రైలుతో సెల్ఫీల కోసం పోటీలు పడ్డారు.