
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
శివమొగ్గ: కెళది శివప్పనాయక కృషి, తోటగారిక విజ్ఞాన విశ్వ విద్యాలయం విద్యార్థులకు వ్యవసాయం గురించి పాఠాలు బోధించడానికి మాత్రమే కాదు, రైతులకు కూడా ఉపయుక్తంగా ఉండాలని మాజీ మంత్రి కాగోడు తిమ్మప్ప అన్నారు. గురువారం ఈ వర్సిటీలో నిర్వహించిన 11వ సంస్థాపన దినోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు ఏ భూమిలో ఎటువంటి పంటలు వేయాలి, తదితర మెళకువలను బోధించాలని సూచించారు. కనీసం పంచాయతీలో 50 మంది రైతులను చైతన్యవంతులను చేయాలన్నారు. అప్పుడు వ్యవసాయ వర్సిటీ విద్యార్థులతో పాటు రైతులకు అనుకూలంగా ఉంటుందన్నారు.
నిందితులను శిక్షించాలని డిమాండ్
బళ్లారిఅర్బన్: నగరంలోని మయూర హోటల్ వెనుక గల ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ నెల 16న గాయపరిచిన వార్డెన్‌ను కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ పార్టీ (బీఎస్పీ) డిమాండ్ చేసింది. గురువారం స్థానిక జిల్లాధికారి కార్యాలయంలో అధికారి మంజునాథ్‌కు వినతిపత్రాన్ని అందించి పార్టీ నాయకులు మాట్లాడారు. విద్యార్థిని గాయపరిచి వారం రోజులైనా చర్యలు తీసుకోలేదన్నారు. తక్షణమే హాస్టల్ వార్డెన్‌ను, వాచ్‌మెన్‌ను శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు హెచ్.మునిస్వామి, పదాధికారులు ఉమాపతి, మహమ్మద్ అలీ, కే.బాబు, చిదానందప్ప, తిప్పేస్వామి, శేఖర్‌బాబు, తిప్పేరుద్ర, సుధీర్‌కుమార్, కృష్ణప్ప పాల్గొన్నారు.

అధికారికి వినతిపత్రాన్ని అందిస్తున్న బీఎస్పీ నాయకులు