
మ్యూజియంలో నాటి ఫొటోలను పరిశీలిస్తున్న మంత్రి
చిక్కబళ్లాపురం: అపరబ్రహ్మ, భారతరత్న సర్ ఎం విశ్వేశ్వరయ్య పేరుపై బెంగళూరులో ఐఐటీ తరహా సంస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఉన్నత శిక్షణ శాఖ మంత్రి డాక్టర్ ఎంసి సుధాకర్ తెలిపారు. సర్ ఎం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ముద్దేనహళ్లిలోని ఆయన సమాధిని దర్శించుకుని మాట్లాడారు. భారత నిర్మాణ రంగంలో ఎన్నో అద్భుతాలకు ప్రాణం పోసిన గొప్ప ఇంజినీర్ విశ్వేశ్వరయ్య అని అన్నారు. బెంగళూరు విశ్వవిద్యాలయం జ్ఞానభారతి క్యాంపస్ ఆవరణంలో వందెకరాలలో ఐఐటీ తరహాలో తాంత్రిక శిక్షణ క్షేత్రం ఏర్పాటు చేస్తామని అన్నారు. అదే విధంగా చిక్కబళ్లాపురం నగరంలోని సర్‌ఎంవి క్రీడాంగణాన్ని అత్యాధునికంగా తీర్దిదిదుతామన్నారు. ఈ సందర్భంగా ఆయన సర్ ఎంవీ మ్యూజియంను సందర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్, కలెక్టర్ రవీంద్ర, జెడ్పీ సీఈఓ ప్రకాశ్, విశ్వేశ్వరయ్య మనవడు సతీశ్ మోక్షగుండం తదితరులు పాల్గొన్నారు.