
వరిసిద్ది వినాయకుడి ఆలయం
కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, జేడీఎస్ మాజీ కార్పొరేటర్లు
బనశంకరి: భక్తులతో నిత్యం కిటకిటలాడే ఆలయాల్లో బెంగళూరు నగరంలోని జయనగర నాలుగోబ్లాక్‌లో ఉన్న వరసిద్ది వినాయకుడి ఆలయం కూడా ఒకటి. 44 ఏళ్లుగా భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్న వరసిద్ది వినాయకుడిగా ప్రఖ్యాతి చెందాడు. ఆలయం నిర్మించిన ప్రాంతం 1976 వరకు ఖాళీ స్థలంగా ఉండేది. అక్కడ పెరిగిన రావిచెట్టు కాండం మొదలు భూభాగం గణేశుని ఆకారాన్ని పోలినట్లు ఉండటం భక్తులను, స్థానికులను విశేషంగా ఆకర్షించింది. ఈ రూపాన్ని ఇప్పటికీ భక్తులు వీక్షించవచ్చు. ఈ గణేశ రూపాన్ని భక్తులు పూజిస్తూ అక్కడ ఒక గుడి నిర్మించాలని తీర్మానించారు. 1977లో బేలిమఠం పూజ్యశ్రీ శివరుద్రస్వామివారి చేతులమీదుగా సిద్ది వినాయకుడిని ప్రతిష్టించారు. అప్పటి నుంచి భక్తులు రద్దీ ఎక్కువ కావడంతో చిన్నదిగా ఉన్న గుడి స్థానంలో శ్రీ వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో 2011లో బృహత్ గాలి గోపురంతో వరసిద్దివినాయకుడి ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. అంతేకాకుండా రూ.50 లక్షలతో స్వామివారికి రథం, వజ్రకిరీటాన్ని తయారు చేయించారు. ఆలయంలో నవగ్రహలను ప్రతిష్టించారు. ఈ గుడికి ఆగ్నేయ ముఖంగా ఉన్న రోడ్డుకు వినాయక రోడ్డుగా బీబీఎంపీ నామకరణం చేసింది.
ఆలయ విశిష్టత...
వరసిద్ది వినాయకుడి ఆలయం త్రికోణాకారంలో నిర్మించడం విశేషం. స్వామివారికి భక్తులు అధికంగా కానుకలు సమర్పిస్తుండటంతో ఆలయం అభివృద్ధి చెంది నగరంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా బాసిల్లుతోంది.
శ్రీస్వర్ణగౌరి వరసిద్ది వినాయక మహోత్సవం 18 తేదీ నుంచి 24 తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ టీఎన్.మంజుల, ప్రధాన అర్చకులు వేదబ్రహ్మ శ్రీచెన్నవీరదేవరు తెలిపారు.
భక్తుల కోర్కెలు తీరుస్తున్న జయనగర విఘ్నేశ్వరుడు
రావిచెట్టు కాండంపై లంబోదరుడి ప్రతిరూపం

రావిచెట్టు కాండంపై వినాయకుడి ప్రతిరూపం

ప్రత్యేక అలంకరణలో వినాయకుడి మూలవిరాట్