ప్రియురాలిపై సామూహిక అత్యాచారం.. డ్యాన్స్‌ మాస్టర్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రియురాలిపై సామూహిక అత్యాచారం.. డ్యాన్స్‌ మాస్టర్‌ అరెస్ట్‌

Aug 2 2023 12:28 AM | Updated on Aug 2 2023 6:40 AM

- - Sakshi

యువతిని ప్రైవేట్‌ వీడియోలతో బెదిరించి ఆత్యాచారానికి పాల్పడిన డ్యాన్స్‌ మాస్టర్‌తో పాటు అతని ఇద్దరి స్నేహితులను బెంగళూరు కొడిగేహళ్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

యశవంతపుర: యువతిని ప్రైవేట్‌ వీడియోలతో బెదిరించి ఆత్యాచారానికి పాల్పడిన డ్యాన్స్‌ మాస్టర్‌తో పాటు అతని ఇద్దరి స్నేహితులను బెంగళూరు కొడిగేహళ్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. యువతికి నాలుగేళ్ల క్రితం సోషల్‌ మీడియాలో యాండీ జార్జీ పరిచయమయ్యాడు. ఇతడు ఒక ప్రైవేటు స్కూల్‌లో డ్యాన్స్‌మాస్టర్‌గా పనిచేసేవాడు.

ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ రెండేళ్ల పాటు షికార్లకు వెళ్లారు. అతడు వేధించడంతో ఆమె కొంతకాలం నుంచి దూరంగా ఉంటోంది. దీంతో యువతితో కలిసి ఉన్న పాత పోటోలు, వీడియోలను చూపిస్తూ బ్లాక్‌ మెయిల్‌ చేయసాగాడు.

ఇటీవల యాండీ జార్జి, స్నేహితులు సంతోష్‌, శశిలు కలిసి తనపై సామూహికంగా అత్యాచారం చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌, పెన్‌ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. యాండీ జార్జీ పాఠశాలలోనూ విద్యార్థులతోను అసభ్యంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలిందని ఈశాన్య డీసీపీ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement