ప్రయాణికుల్లేక.. ప్రైవేటు బస్సులు వెలవెల.. కారణం ఇదే | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల్లేక.. ప్రైవేటు బస్సులు వెలవెల.. కారణం ఇదే

Jun 15 2023 7:28 AM | Updated on Jun 15 2023 8:37 AM

బెంగళూరులో సిటీ బస్‌లో ఉచిత టికెట్‌ తీసుకుంటున్న విద్యార్థినులు  - Sakshi

బెంగళూరులో సిటీ బస్‌లో ఉచిత టికెట్‌ తీసుకుంటున్న విద్యార్థినులు

ఉచిత ప్రయాణ వసతి పథకంతో మహిళలందూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ప్రైవేటు బస్సులు వెలవెలపోతున్నాయి.

చిక్కబళ్లాపురం: ఉచిత ప్రయాణ వసతి పథకంతో మహిళలందూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ప్రైవేటు బస్సులు వెలవెలపోతున్నాయి. మహిళలు రాష్ట్ర పరిధిలో ఎక్కడినుంచైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం శక్తి యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉచిత ప్రయాణ సదుపాయంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. మహిళలు ప్రైవేటు బస్సులపై కన్నెత్తి చూడటం లేదు.

దీంతో ప్రైవేటు బస్సులు బస్టాండ్లలో ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు టాప్‌ సర్వీస్‌లతో నడిచిన తమ బస్సులు ఇప్పుడు బోసిపోయాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్షన్లు లేకపోతే తమకు జీతాలు రావని డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలను ఎలా పోషించాలని ప్రశ్నిస్తున్నారు. ఇక యజమానులు మాట్లాడుతూ కలెక్షన్లు పడిపోతే తమ బస్సులను గుజరీకి పంపాల్సి ఉంటుందని చెప్పడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement