పవర్‌ కట్‌ ప్రాంతాలు | - | Sakshi
Sakshi News home page

పవర్‌ కట్‌ ప్రాంతాలు

Oct 11 2026 12:51 AM | Updated on Oct 11 2026 12:51 AM

మున్నూరు కాపులను చైతన్యపరచాలి విద్యుత్‌ సరఫరా చేయాలని రాస్తారోకో

కొత్తపల్లి: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపు, ఏబీ స్విచ్‌ల మరమ్మతు పనుల కారణంగా ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫైర్‌ స్టేషన్‌, టౌటూన్‌ పోలీస్‌స్టేషన్‌, విఘ్నేశ్వర హాస్టల్‌, ఆర్బీ స్వీట్‌ హౌస్‌, అన్వర్‌ హోటల్‌, శ్రీరామ బుక్‌ స్లాట్‌, మోర్‌ సూపర్‌ మార్కెట్‌, గోపాల్‌రావు భవనం, వాణిసూపర్‌ మార్కెట్‌, జాఫ్రీ మజీదు, జిల్లా గ్రంధాలయం, వాణినికేతన్‌ కళాశాల, ముకరంపుర, బస్టాండ్‌, భగత్‌నగర్‌, పోలీస్‌ హెడ్‌ క్వార్టర్లు, మున్సిపల్‌ ఆఫీస్‌, జెడ్పీ ఆఫీసు, శ్రద్ధ ఇన్‌, ఎన్టీఆర్‌ విగ్రహం, డీమార్ట్‌, బైపాస్‌, పాలిటెక్నిక్‌ కళాశాల, ఐటీఐ కళాశాల ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

కరీంనగర్‌: మున్నూరు కాపులు ఐక్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మున్నూరు కాపు సంఘం అపెక్స్‌ కమిటీ గౌరవ చైర్మన్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం కరీంనగర్‌ చైతన్యపురిలోని మహాశక్తి ఆలయంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో భవి ష్యత్‌ కార్యాచరణపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కులబాంధవులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి, ఐక్యత, సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించి గ్రామీణ స్థాయి నుంచి మున్నూరు కాపులను సంఘటితం చేసి చైతన్యపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తం, జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యదర్శి దామరాకొండా సంతోష్‌, అనంతుల రమేశ్‌, కూరగాయల తిరుపతి, వాసాల హరీశ్‌, వొంటేల శరత్‌, నేతికుంట అజయ్‌, ఆవుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రామడుగు: కరీంనగర్‌–జగిత్యాల జాతీయ రహదారి వెదిరలోని వివేకానంద చౌరస్తా వద్ద రైతులకు 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు మోడీ రవీందర్‌ ఆధ్వర్యంలో శనివారం రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 24 గంటలు విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. బీజేపీ నాయకులు మేకల ప్రభాకర్‌యాదవ్‌, ఉప్పు రాంకిషన్‌, ఉప్పు శ్రీనివాస్‌, బండ తిరుపతిరెడ్డి, కొలపురి రమేశ్‌, మామిడిపల్లి చైతన్య, పోచంపల్లి నరేశ్‌, గుంట అశోక్‌, కాడె నర్సింగం, ఎడవెల్లి రాం, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement