రామరామ రామాఉయ్యాలో.. ఒక్కేసి పువ్వేసి చందమామా.. అంటూ ఊరూవాడా మార్మోగింది. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు శనివారం ఎంగిలి పూలతో ఘనంగా ప్రారంభమయ్యా యి. పొద్దున్నే పూలు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చారు. సాయంత్రం ఆడబిడ్డలు ఒక్కచోట చేరి ఆడిపాడారు. బతుకమ్మ పాటలతో ఊరూవాడా వీధులు మార్మోగగా.. పొద్దు పోయే వరకు సందడి చేశారు. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం, మంకమ్మతోట, రాంనగర్, కోతిరాంపూర్, టవర్‌సర్కిల్, గంజ్‌తో పాటు అన్ని డివిజన్లు పూల జాతరను తలపించాయి. ఆడిపాడిన మహిళలు బతుకమ్మలను సమీప నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.


