డంపుయార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

డంపుయార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం

Oct 11 2026 12:51 AM | Updated on Oct 11 2026 12:51 AM

● మంటలు అదుపు చేయించిన మేయర్‌ ● రూ.17కోట్లతో బయోమైనింగ్‌ ● రూ.80కోట్లతో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌

● మంటలు అదుపు చేయించిన మేయర్‌ ● రూ.17కోట్లతో బయోమైనింగ్‌ ● రూ.80కోట్లతో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: దశాబ్దాలుగా పేరుకుపోయిన డంపుయార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. మంటలు, పొగలను నివారించేందుకు తాత్కాలికంగా కూడా చర్యలు చేపట్టామని తెలిపారు. శనివారం నగరంలోని డంపుయార్డ్‌ను తనిఖీ చేశారు. మున్సిపల్‌ వాటర్‌ ట్యాంకర్లకు మోటార్‌ ఫ్రెషర్‌ పంప్‌లను అమర్చి చెలరేగుతున్న మంటలు, పొగను అదుపు చేయించారు. పూర్తిస్థాయిలో మంటలు, పొగలు ఆర్పేందుకు బృందాలవారీగా 12 మంది సిబ్బందిని ప్రత్యేకంగా డంపుయార్డ్‌లో నియమించారు. అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడి మంటలార్పేందుకు సహకరించాలని కోరారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రజలకిచ్చిన మాట ప్రకారం డంపుయార్డ్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. 40 సంవత్సరాలుగా డంపుయార్డ్‌లో చెత్త పేరుకుపోతోందని, ఇప్పుడు 5లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త ఉందని అన్నారు. మంటలు, పొగ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందుకే రూ.17కోట్లతో బయోమైనింగ్‌ చేపడుతున్నామని అన్నారు. టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి, 4 మిషన్లతో బయోమైనింగ్‌ చేస్తామన్నారు. ఆరేడు నెలల్లోనే దాదాపు 2లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త తొలగేలా చూస్తామని చెప్పారు. బయోమైనింగ్‌కు రోజువారీగా వచ్చే 150 మెట్రిక్‌ టన్నుల చెత్త ఇబ్బందిగా మారిందన్నారు. యూసీఎఫ్‌ రూ.80కోట్లతో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కింద చెత్తను పూర్తిగా శాసీ్త్రయ పద్దతిలో తొలగిస్తామని చెప్పారు. కార్పొరేటర్లు మాసం గణేశ్‌, చంద్ర, తోట అనిల్‌, మేకల వెంకటేశ్‌, పడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య, అధికారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement