● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్‌ | - | Sakshi
Sakshi News home page

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్‌

Oct 11 2026 12:51 AM | Updated on Oct 11 2026 12:51 AM

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్‌

కరీంనగర్‌క్రైౖం: నూతన క్రిమినల్‌ చట్టాలు, క్రిమినల్‌ ట్రయల్స్‌లోని సూక్ష్మాంశాలపై న్యాయవాదులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శివకుమార్‌ సూచించారు. న్యాయవాది ఎప్పుడూ నిత్య విద్యార్థిగా ఉంటూ.. తన జ్ఞానాన్ని నిరంతరం పెంపొందించుకోవాలన్నారు. కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సెంటర్‌ ఫర్‌ ప్రాక్టీసింగ్‌ లా, హైదరాబాద్‌ సహకారంతో శనివారం నిర్వహించిన న్యాయ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్‌ఏ)–2023 చట్టాలపై న్యాయవాదులకు సమగ్ర అవగాహన అవసరమని పేర్కొన్నారు. న్యాయవాది మెదడే ప్రధాన ఆయుధమని, నిరంతరం పదును పెట్టుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమ నిర్వాహకుడు ఏపీ సురేశ్‌ రామ్‌ మాట్లాడుతూ.. క్రిమినల్‌ చట్టాలపై అవగాహనతోపాటు సివిల్‌ కేసుల్లోనూ న్యాయవాదులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. అసోసియేషన్‌ ఆహ్వానం మేరకు స్పందించి శిక్షణ సదస్సు నిర్వహించిన సెంటర్‌ ఫర్‌ ప్రాక్టీసింగ్‌ లా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు బండ శివ, బొడ్ల గీతారాణి, ప్రధాన కార్యదర్శి చెండ్రపాటి కిరణ్‌కుమార్‌, బొజ్జ స్వామి, సుంకె దేవకిషన్‌, బెజ్జంకి శ్రీకాంత్‌, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement