రైల్వేయాప్‌లో ఫెస్టివల్‌ రైళ్ల వివరాల అప్‌డేట్‌ | - | Sakshi
Sakshi News home page

రైల్వేయాప్‌లో ఫెస్టివల్‌ రైళ్ల వివరాల అప్‌డేట్‌

Oct 11 2026 12:51 AM | Updated on Oct 11 2026 12:51 AM

రామగుండం: సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌–హైద్రాబాద్‌ మధ్య దక్షిణ మధ్య రైల్వే ఫెస్టివల్‌ స్పెషల్‌, ఇటీవల జన్‌ సాధారణ రైళ్లను నడిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కొన్ని నెలలుగా ప్రత్యేకంగా నడిపించే రైళ్ల వివరాలు మాత్రమే రైల్వేయాప్‌లో అప్‌డేట్‌ చేస్తుండగా, ఫెస్టివల్‌ స్పెషల్‌, జనసాధారణ్‌ రైళ్ల వివరాలు అప్‌డేట్‌ చేయకపోవడంతో వాటి వివరాలు అందులో చూపించవు. దీంతో ప్రయాణికుల్లో అంతగా ప్రాచుర్యం సంపాదించుకోలేక సరైన ఆక్యుపెన్సీ రేషియో రాలేదు. ఈ విషయమై పలుసార్లు ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతోపాటు ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు కంకటి ఫణిందర్‌ ‘సాక్షి’ కథనాలను జోడిస్తూ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈక్రమంలో రెండురోజుల క్రితం సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ మధ్య నడిచే ప్రత్యేక రైలు నం.07711/12 తాజాగా శుక్రవారం రాత్రి రైల్వేయాప్‌లో అప్‌డేట్‌ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ప్రతీ ప్రయాణికుడు తమ డే టూర్‌ చేసే క్రమంలో తొలుత రైల్వేయాప్‌లో రైళ్ల వివరాలు గుర్తించి ప్రయాణం చేయడం సాధారణంగా మారిన విషయం తెలిసిందే.

జాతీయ ఉషు పోటీలకు కొత్తపల్లి విద్యార్థి

గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థి సాయికృష్ణ స్కూల్‌ గేమ్స్‌ జాతీయస్థాయి ఉషు పోటీలకు ఎంపికయ్యాడు. గత నెలలో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 15, 16, 17తేదిల్లో జమ్ముకశ్మీర్‌లో పోటీలు జరుగనున్నాయి. సాయికృష్ణను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోతుల నారాయణ, వ్యాయామ ఉపాధ్యాయుడు బార భాను అభినందించారు.

హెచ్‌సీఏ మహిళల క్రికెట్‌ శిక్షణ ప్రారంభం

కరీంనగర్‌స్పోర్ట్స్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో అలుగునూరులోని వీజేఆర్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ అకాడమీలో 9 రోజులపాటు నిర్వహించనున్న మహిళల రెసిడెన్షియల్‌ క్రికెట్‌ శిక్షణ శిబిరం శనివారం ప్రారంభమైంది. శిబిరాన్ని అంతర్జాతీయ క్రికెటర్‌, హెచ్‌సీఏ మహిళా క్రికెట్‌ అభివృద్ధి విభాగం అధిపతి సునీతాఆనంద్‌, హెచ్‌సీఏ సీనియర్‌ సభ్యులు రియాజ్‌ ఖురేషీ, మానసదేవి ప్రారంభించారు. శిక్షణ శిబిరాన్ని 4 జిల్లాల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా క్రికెటర్లకు నాణ్యమైన శిక్షణ అందించడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, తెలంగాణలో మహిళా క్రికెట్‌కు మరిన్ని అవకాశాలు కల్పించడం ఈ శిబిరం ప్రధాన లక్ష్యాలన్నారు. హెడ్‌ కోచ్‌గా రాధాకృష్ణ, అసిస్టెంట్‌ కోచ్‌గా పీబీ సాయి లేహా, ఫీల్డింగ్‌ కోచ్‌గా అబ్దుల్‌ రహీమ్‌, ఫిజియోథెరపిస్ట్‌గా దీక్షిత వ్యవహరిస్తారని తెలిపారు. టీ20 గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఆగంరావు, ఉపాధ్యక్షులు మహేందర్‌గౌడ్‌, కార్యదర్శి మనోహర్‌రావు, కార్యవర్గ సభ్యులు అజిత్‌రావు, విద్యాసాగర్‌, హరికిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటు చోరీని నిరసిస్తూ కాంగ్రెస్‌ నిరాహారదీక్ష

కరీంనగర్‌ కార్పొరేషన్‌: దేశంలో బీజేపీ పాల్పడుతున్న ఓట్‌చోరీకి వ్యతిరేకంగా, ఏఐసీసీ, పీసీసీ పోరాటాలకు మద్దతుగా కాంగ్రెస్‌ కమిటీ కరీంనగర్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ ఆధ్వర్యంలో పార్టీ నిరాహారదీక్ష చేపట్టింది. శనివారం నగరంలోని ఇందిరాచౌక్‌లో అంజన్‌కుమార్‌తో పాటు ఆకారపు భాస్కర్‌రెడ్డి, అబ్దుల్‌ రెహమాన్‌, వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్‌రెడ్డి, పడిశెట్టి భూమయ్య, మూల జైపాల్‌, దన్నా సింగ్‌, కామ్రెడ్డి రాంరెడ్డి, కంకణాల అనిల్‌,లాయక్‌, చింతల ఎల్లారెడ్డి తదితరుల దీక్ష చేశారు. సాయంత్రం పీసీసీ ప్రదాన కార్యదర్శి రహమత్‌ హుస్సేన్‌, డీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఏఎంసీ చైర్మన్‌ ఆకుల నర్సయ్య, ఎం.డి.తాజ్‌, కర్ర రాజశేఖర్‌, శ్రావణ్‌నాయక్‌, ఆకుల ఉదయ్‌, ఫహాద్‌, అహ్మద్‌ అలీ, మహమ్మద్‌ అమీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement