పండక్కి ఊరెళ్తున్నారా..?! | - | Sakshi
Sakshi News home page

పండక్కి ఊరెళ్తున్నారా..?!

Oct 11 2026 12:51 AM | Updated on Oct 11 2026 12:51 AM

● ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేసే అవకాశం ● సమాచారం ఇవ్వాలని పోలీస్‌ శాఖ సూచన

● ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేసే అవకాశం ● సమాచారం ఇవ్వాలని పోలీస్‌ శాఖ సూచన

జగిత్యాలక్రైం: బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు రావడంతో ఉద్యోగులు, ఇతరత్రా ప్రజలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీనిని అదునుగా చేసుకుని దొంగలు ఇళ్లలో చోరీలు చేసే అవకాశం ఉందని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దొంగతనాలను నివారించవచ్చంటున్నారు పోలీసులు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతోపాటు చుట్టు పక్కలవారికి ఇంటివైపు చూడాలని సమాచారం ఇవ్వాలంటున్నారు. మరోవైపు చోరీల నియంత్రణకు పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

● రాత్రి సమయంలో ఇంటిముందు వరండాలో లైట్లు వెలిగేలా ఏర్పాట్లు చేసుకోవాలి

● ద్విచక్ర వాహనాలకు వీల్‌ లాక్‌ వేయాలి

● సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని సెల్‌ఫోన్‌కు ఆనుసంధానం చేసుకోండి

● ఊరికి వెళ్లి ఎప్పుడు తిరిగొస్తారు వంటి వివరాలు.. చిరునామా.. ఫోన్‌ నంబర్‌.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసుకుంటే ఆయా ప్రాంతాల్లో గస్తీ పెంచే అవకాశం ఉంటుంది.

● అపార్ట్‌మెంట్‌వాసులు వాచ్‌మెన్లను కచ్చితంగా విధులు నిర్వర్తించాలని చెప్పాలి. కొత్త వ్యక్తులు వస్తే పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పాలి.

● అర్ధరాత్రి నుంచి వేకువజామున నాలుగు గంటల ప్రాంతంలో చోరీలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండడంతో ఆ సమయంలో ఆప్రమత్తంగా ఉండాలని వాచ్‌మెన్లకు సూచించాలి.

● ఇళ్లకు తాళాలు వేసే సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు పెట్టవద్దు.

● అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీస్‌స్టేషన్లకు గాని, 112 నంబర్‌కు డయల్‌ చేయాలి.

సమాచారం ఇవ్వాలి

ఊళ్లకు వెళ్లేవారు సమీపంలోని పోలీస్‌స్టేషన్లలో సమాచారం అందించాలి. దీంతో వారి ఇళ్లు, కాలనీల్లో గస్తీ నిర్వహిస్తాం. రాత్రి సమయంలో నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. పోలీసులతోపాటు చుట్టూ పక్కల ఇళ్ల వారికి, కాలనీ పెద్దలకు సమాచారం ఇచ్చి వెళ్తే చోరీలు జరగకుండా నివారించవచ్చు.

– అశోక్‌కుమార్‌, ఎస్పీ, జగిత్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement