బకాయి కట్టు.. రిజల్ట్‌ పట్టు | - | Sakshi
Sakshi News home page

బకాయి కట్టు.. రిజల్ట్‌ పట్టు

Oct 11 2026 12:51 AM | Updated on Oct 11 2026 12:51 AM

● ఇది శాతవాహన యూనివర్సిటీ అధికారుల తీరు ● విద్యార్థుల సెమిస్టర్‌ ఫలితాలకు బ్రేక్‌

● ఇది శాతవాహన యూనివర్సిటీ అధికారుల తీరు ● విద్యార్థుల సెమిస్టర్‌ ఫలితాలకు బ్రేక్‌

కరీంనగర్‌ సిటీ: మెస్‌ చార్జీలు కట్టలేదని, మీ రిజల్ట్‌ రాదంటూ శాతవాహన యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను పంపించేసిన సంఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. విద్యార్థుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో మెస్‌ చార్జీలు చెల్లించలేదనే కారణంతో నాలుగో సెమిస్టర్‌ ఫలితాలు నిలిపేశారు. అయితే మరి అందరి ఫలితాలు నిలిపేశారా అంటే అదీ లేదు. కేవలం మెస్‌ చార్జీలు చెల్లించని వారి ఫలితాలు మాత్రమే నిలిపేశారు. పేద విద్యార్థులు చదువుకుంటున్న ఈ యూనివర్సిటీలో మెస్‌ చార్జీలపై అధికారులు కఠినంగా వ్యవహరించడం పట్ల మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రూ.కోట్లు విద్యార్థులకు ఉపయోగపడని వాటిపై ఖర్చు చేస్తున్న అధికారులు.. మెస్‌ చార్జీలపై కఠినంగా ఉండడం సరికాదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీ ఇష్టారాజ్యంగా తయారైందని, హాల్‌ టికెట్ల జారీ సమయంలో ఒత్తిడితో అండర్‌ టేకింగ్‌పై సంతకాలు తీసుకున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో హాస్టల్‌ మెస్‌ బకాయిలు చెల్లించలేదనే కారణంతో పలువురి నాలుగో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను నిలిపేశారని విద్యార్థులు తెలిపారు. ఈ చర్యతో తమ విద్యా భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని, ఫలితాల విడుదలపై స్పష్టత లేక ఆందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష హాల్‌ టికెట్ల జారీ సమయంలో పెండింగ్‌ ఫీజులు, హాస్టల్‌ మెస్‌ బకాయిలను నిర్ణీత గడువు లోగా చెల్లిస్తామని పేర్కొంటూ అండర్‌ టేకింగ్‌ లేఖపై సంతకాలు తీసుకున్నారన్నారు. పరీక్షకు కొద్దిసేపటి ముందు ఈ ప్రక్రియ చేపట్టడంతో ఒత్తిడికి లోనై సంతకాలు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, సంబంధిత ఉన్నతాధికారులను ఆశ్రయించడంతోపాటు అవసరమైతే తెలంగాణ హైకోర్టును సంప్రదించి న్యాయపరమైన పరిష్కారం కోరుతామని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా.. మెస్‌ చార్జీలు చెల్లించని కొంతమంది పరీక్ష ఫలితాలు నిలిపేసిన మాట వాస్తవమేనన్నారు. విద్యార్థులకు ముందుగానే సమాచారమందించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement