● గల్లంతైన యువకుడు శవమై.. ● వెంకటాపూర్‌లో విషాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేపలు, తాబేళ్లు పట్టేందుకు స్నేహితులతో కలిసి చెరువుకు వెళ్లిన యువకుడు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మోతె ఎల్లయ్య– ఎల్లవ్వ దంపతుల కొడుకు కిరణ్(33) శుక్రవారం తన స్నేహితులు కంకనాల అంజి, మోతె స్వామితో కలిసి గ్రామ శివారులోని అవుసుల రామయ్యకుంటలో తాబేళ్లు, చేపలు పట్టేందుకు వెళ్లారు. అక్కడే విందు చేసుకున్నారు. మద్యంమత్తులో ఉన్న కిరణ్ మరోసారి చేపలు పట్టేందుకు చెరువులోకి దిగాడు. లోతైన ప్రాంతానికి వెళ్లి గల్లంతయ్యాడు. రాత్రి అవుతున్న కిరణ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చెరువు వద్దకు వెళ్లారు. చెరువుగట్టుపై ఉన్న మద్యం సీసాలు, కిరణ్ చెప్పులు, దుస్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రమేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో రెస్క్యూటీం రాత్రంతా చెరువులో గాలించారు. శనివారం ఉదయం మృతదేహం నీటిపై తేలింది. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కిరణ్‌కు భార్య సుమలత, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.


