కరీంనగర్‌స్పోర్ట్స్: రేకుర్తిలోని లయోలా పాఠశాలలో శనివారం కరీంనగర్ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి (పెద్దపల్లి జిల్లా మినహా) సీనియర్ ఖోఖో జట్ల ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 50 మంది పురుషులు, 30 మంది మహిళలు హాజరయ్యారు. ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వై మహేందర్ రావులు క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు రాష్ట్రస్థాయిలో కరీంనగర్ జిల్లా జట్లు ప్రతిభ చాటి విజేతలుగా నిలవాలన్నారు. రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ రెఫరీస్ బోర్డ్ కన్వీనర్ వంగపల్లి సూర్యప్రకాశ్, జిల్లా ఖోఖో సంఘ ఉపాధ్యక్షులు కుమారస్వామి, రవీందర్, సంతోష్, శేఖర్, రేణుక, రాజబాబు, రవి, కరుణాకర్, రాము, తదితరులు పాల్గొన్నారు.


