కరీంనగర్ కార్పొరేషన్: యూసీఎఫ్ నిధులతో నగరంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగనుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపా రు. మంగళవారం 47వ డివిజన్‌లో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి డిప్యూటీ మేయర్ వై.సునీల్‌రావు, కార్పొరేటర్ గాజ రమ శివరాంతో కలిసి భూమిపూజ చేశారు. కేంద్ర మంత్రి సంజయ్ సహకారంతో వచ్చిన రూ.840 కోట్ల నిధులతో నగరంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగనుందన్నా రు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, కె.ప్రమోద్‌రావు, ప్రవీణ్, రాజు పాల్గొన్నారు.
తాగునీటి కోసం ఆందోళన
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం కొండాపూర్‌లో మంగళవారం మహిళలు తాగునీటి కోసం హుస్నాబాద్– కరీంనగర్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసనకు దిగా రు. ఫోర్‌లైన్ రహదారి పనుల్లో జేసీబీతో రహదారి పనులు చేస్తుండగా, పైపులు పగిలి మిషన్‌భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. సర్పంచ్ మార్క రాజ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి అమృతవర్షిణి మహిళలతో మాట్లాడారు. జీపీ ట్రాక్టర్‌తో తాగునీరు సరఫ రా చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.
ఎఫ్‌ఎల్‌ఎన్‌పై సమీక్ష
కరీంనగర్ టౌన్: ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా సామర్థ్యాలను పెంపొందించే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఎఫ్‌ఎల్‌ఎన్ జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ ఎఫ్‌ఎ ల్‌ఎన్ స్పాట్ అసెస్‌మెంట్ ఫలితాలు, మండల విద్యాధికారులు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయుల పాఠశాలల సందర్శన, విద్యార్థుల హాజరు శాతంపై సమీక్షించారు. తక్కువ హాజరు నమోదవుతున్న పాఠశాలలను గుర్తించి విద్యార్థుల హాజరును పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. 2027 మార్చిలో నిర్వహించనున్న ఎఫ్‌ఎల్‌ఎన్ తుది మదింపు పరీక్షలో విద్యార్థులు అత్యుత్తమ ఫలి తాలు సాధించేలా కృషి చేయాలని, జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు పనిచేయాలని పిలుపునిచ్చారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: కొత్త డీటీఆర్ ఏర్పాటు, విద్యుత్ లైన్ల పనుల కారణంగా బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ.క్రిస్టియన్‌కాలనీ ఫీడర్ పరిధిలోని రెడ్డి రెసిడెన్సీ, విజయమోహన్‌రెడ్డి ఆస్పత్రి, సవరన్ స్ట్రీట్, మెడ్‌కవర్ ఆస్పత్రి ప్రాంతాలతో పాటు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.ఐబీ ఫీడర్ పరిధిలోని సర్కస్ మైదానం, ఐబీ చౌరస్తా ప్రాంతాలు, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ.తెలంగాణచౌక్ ఫీడర్ పరిధి లోని శ్రీనగర్‌కాలనీ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అవాజ్‌బౌలి, కశ్మీర్‌గడ్డ, మైసమ్మ చెట్టు, రైతు బజార్, షాలిమార్ ఫంక్షన్ హాల్, ఫైర్‌స్టేషన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు.
‘జోష్’, టీబీ ముక్త్ పంచాయత్‌లకు సన్మానం
కరీంనగర్: ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా క్షయవ్యాధి (టీబీ) నిర్మూలనే లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించడం, వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణ చర్యలను బలోపేతం చేసేందుకు ‘జోష్’ (జేవోఎస్‌హెచ్–జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్) టీమ్స్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. టీబీ రహిత గ్రామాలుగా నిలిచిన ‘టీబీ ముక్త్ పంచాయత్’ల సర్పంచులను సన్మానించడంతో పాటు ఎంీపీడీవో, మై భారత్ వలంటీర్లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ కేడెట్లతో కూడిన జోష్ టీంల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఈ నెల 8న కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.


