ఇండోర్‌ ఉపకేంద్రం టెక్నికల్‌ చార్జ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇండోర్‌ ఉపకేంద్రం టెక్నికల్‌ చార్జ్‌

Oct 6 2026 11:53 PM | Updated on Oct 6 2026 11:53 PM

● రూ.6.92 కోట్లతో 33/11 కేవీ ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ ● కరీంనగర్‌లో 484 చదరపు గజాల్లో ఆధునిక నిర్మాణం

కొత్తపల్లి(కరీంనగర్‌): పట్టణ/నగర ప్రాంతాల్లో స్థలాభావ సమస్యకు చెక్‌ పెడుతూ, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించడంమే లక్ష్యంగా టీజీఎన్పీడీసీఎల్‌ ముందడుగు వేస్తోంది. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా తక్కువ స్థలంలో అధిక సామర్థ్యంతో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఆధునిక ఇండోర్‌ విద్యుత్‌ ఉపకేంద్రాలు నిర్మిస్తున్నారు. ఉత్తర తెలంగాణ(టీజీఎన్పీడీసీఎల్‌)లోనే తొలి ఇండోర్‌ ఉపకేంద్రంను కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో నిర్మించారు. మంగళవారం సంస్థ సీఎండీ కర్ణాటి వరుణ్‌ రెడ్డి టెక్నికల్‌ చార్జ్‌ చేశారు. 33/11 కె.వీ. ఇండోర్‌ ఉపకేంద్రాన్ని 484 చదరపు గజాల విస్తీర్ణంలో రూ.6.92 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ టీజీఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో కరీంనగర్‌లో నిర్మించిన తొలి ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ ఇదేనని, పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా తక్కువ స్థలంలో అధిక సామర్థ్యంతో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి రావడంతో ఎస్సారార్‌, భగత్‌నగర్‌, సప్తగిరి 33/11 కేవీ సబ్‌స్టేషన్లపై విద్యుత్‌ భారం తగ్గడంతో పాటు కరీంనగర్‌ విద్యుత్‌ సరఫరా సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. 132 కేవీ వావిలాలపల్లి, పద్మనగర్‌ ఉపకేంద్రాల నుంచి ఈ సబ్‌స్టేషన్‌కు 33 కేవీ విద్యుత్‌ సరఫరా అందుబాటులో ఉందన్నారు. నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని కలెక్టరేట్‌లో మరో ఇండోర్‌ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. డైరెక్టర్లు వి.మోహన్‌రావు, టి.మధుసూదన్‌, చీఫ్‌ ఇంజినీర్లు కె.తిరుమల్‌రావు, సురేందర్‌, అన్నపూర్ణ, కరీంనగర్‌ ఎస్‌ఈ ఐరెడ్డి విజేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement